AP 10వ తరగతి ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 (AP 10th English Model Question Paper 2023): ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన AP SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023ని (AP 10th English Model Question Paper 2023) ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత జరగబోయే ఇంగ్లీష్ పరీక్షకు విద్యార్థులు బాగా ప్రీపేర్ అయ్యేందుకు బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్ ప్రశ్న పత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆ మోడల్ ప్రశ్నాపత్రాన్ని ఇక్కడ అందజేశాం. మోడల్ ప్రశ్నాపత్రం (AP 10th English Model Question Paper 2023) విద్యార్థులకు ప్రశ్నల సరళిని, విధానాన్ని, మార్కుల గురించి తెలుసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు పరీక్షలకు బాగా ప్రీపేర్ అయ్యేందుకు మోడల్ ప్రశ్నాపత్రాలు ఎంతగానో సహాయపడతాయి.
AP SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోండి (Download AP SSC (10th) English Model Question Paper 2023 PDF)
AP SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 కోసం PDFని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.AP SSC ఇంగ్లీష్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF- Click Here ! |
---|
AP SSC ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం 2023 కోసం ముఖ్యమైన పాయింట్లు (Important Points for AP SSC (10th) English Question Paper 2023)
AP పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించి ఇక్కడ గమనించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
- ఇంగ్లీష్ ప్రశ్నపత్రం కోసం 100 మార్కులకు ఉంటుంది.
- మొత్తం ప్రశ్నపత్రానికి సమాధానం ఇవ్వడానికి విద్యార్థులకు 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది. మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదవడానికి మాత్రమే కేటాయించబడుతుంది.
- AP పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం 2023 మూడు విభాగాలుగా విభజించబడింది, ప్రతి సెక్షన్‌కి ప్రత్యేక మార్కులు ఉంటాయి.
- అన్ని విభాగాల్లో ప్రశ్నలకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాలి.
- కొన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపికలు ఉంటాయి. అయితే మొత్తంగా విద్యార్థులు మొత్తం 35 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
- సెక్షన్ల వారీగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.