ఏపీ10వ తరగతి ఫలితాలు ఆశించిన విడుదల తేదీ 2024 (AP SSC Class 10 Result Expected Release Date 2024)
విద్యార్థులకు సూచనగా గత సంవత్సరాల్లో పరీక్ష తేదీ, ఫలితాల తేదీల (AP SSC Result Date 2024) వివరాలను ఈ దిగువున పట్టికలో చూడవచ్చు.
పరీక్ష సంవత్సరం | పరీక్ష తేదీ | ఫలితాల తేదీ |
---|---|---|
2022 | ఏప్రిల్ 27 నుంచి మే 9, 2022 వరకు | జూన్ 4, 2022 |
2023 | ఏప్రిల్ 3 నుంచి 18, 2023 వరకు | మే 6, 2023 |
2024 | మార్చి 18 నుంచి 30, 2024 వరకు | ఏప్రిల్ లేదా మే 2024 |
విడుదలైన వెంటనే ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులకు రోల్ నెంబర్, పుట్టిన తేదీ కోసం వారి అడ్మిట్ కార్డ్‌లు అవసరం. ఒకవేళ అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయలేకపోతే, అభ్యర్థులు వెంటనే AP SSC బోర్డుని సంప్రదించాలి. ఇంకా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో అర్హత సాధించడం అవసరం. ఒక సబ్జెక్టులో కూడా ఫెయిల్ అయితే వైఫల్యానికి దారి తీస్తుంది. అలాంటి విద్యార్థులు AP SSC బోర్డు నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు, దీని షెడ్యూల్ ఫలితాలతో పాటు ప్రకటించబడుతుంది. కాబట్టి, ఫలితాలు విడుదలైన వెంటనే సరిచూసుకోవడం మంచిది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందవచ్చు.