AP SSC ఫలితాలు 2024 (AP 10th Class Results 2024) : స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ AP SSC ఫలితాలు 2024 (AP 10th Class Results 2024) ఏప్రిల్ 20, 2024 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం AP SSC ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లో విడుదల చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం, పేపర్ కరెక్షన్ ఏప్రిల్ 8వ తేదీన ముగుస్తుంది. ఆపై మార్కుల క్రాస్ చెకింగ్, డేటా అప్‌లోడ్ ఏప్రిల్ 15 నుంచి18, 2024 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లో AP SSC ఫలితాలను 2024ని విడుదల చేస్తుంది. AP SSC ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులు రోల్ నెంబర్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. ఈ ఏడాది AP SSC పరీక్షకు మొత్తం 6.3 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అభ్యర్థులు తమ AP SSC 2024 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయడమే కాకుండా SMS ద్వారా కూడా చెక్ చేయవచ్చు. దీని కోసం అభ్యర్థులు SSC రోల్ నెంబర్‌ని టైప్ చేసి, ఆపై దానిని 56263కి పంపించాలి. ఆ తర్వాత అభ్యర్థులు వారి సంబంధిత పాఠశాలల నుంచి వారి మార్కు షీట్లను సేకరించాలి. అభ్యర్థులు AP SSC 2024 మార్క్ షీట్‌లలో విద్యార్థుల పేరు, సబ్జెక్ట్ వారీగా మార్కులు, పొందిన గ్రేడ్‌లు, హాల్ టిక్కెట్ నెంబర్, అర్హత స్థితి మొదలైన వివరాలను కనుగొంటారు.
AP SSC ఫలితాలు 2024: చెక్ చేసుకునే విధానం (AP SSC Results 2024: Steps to Check)
AP SSC 2024 ఫలితాలను విడుదల చేసే విధానం ఆన్‌లైన్‌లో ఉంది. AP SSC ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు దిగువున తెలిపిన దశలను ఫాలో అవ్వాలి. అప్పుడే చాలా సులభంగా పదో తరగతి ఫలితాలను చూసుకోవచ్చు.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను bse.ap.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో అభ్యర్థులు “AP 10వ తరగతి ఫలితం” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- సంబంధిత ఫీల్డ్‌లోని విద్యార్థుల రోల్ నెంబర్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
- అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- AP SSC ఫలితం 2024 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- తర్వాత ఆ ఫలితాలను ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. అయితే ఒరిజినల్ మార్కు షీట్లను సంబంధిత పాఠశాలల నుంచే పొందాల్సి ఉంటుంది.