ఏపీ టెట్ 2024 (AP TET 2024 Notification):
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ (AP TET 2024 Notification) ఈరోజు అంటే జనవరి 30, 2024న విడుదలయ్యే ఛాన్స్ ఉంది. AP TET నోటిఫికేషన్ 2024 PDF డౌన్‌లోడ్ ఫైల్‌గా అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో ఉంటుంది. AP TET అప్లికేషన్ ఫార్మ్ 2024 కూడా నోటిఫికేషన్‌తో పాటు విడుదల చేయబడుతుంది. AP TET పరీక్ష 2024 ఆగస్టు 2024లో నిర్వహించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ TET 2024 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను, అప్‌డేట్‌లను ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2024 పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP DSC) పాఠశాల విద్యా శాఖ త్వరలో నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మీడియా కథనాల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ (DSC) పరీక్షను నిర్వహించడానికి ముందే ఏపీ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి పాఠశాల విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. 2022, 2023లో BEd, DEd పూర్తి చేసిన అభ్యర్థులు కూడా AP TET 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
AP TET 2024 నిబంధనల్లో మార్పులు...
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే ముందే ప్రభుత్వం ఉపాద్యాయ అర్హత పరీక్ష (TET)ను రాసేందుకు అభ్యర్థుల అర్హతలను సవరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఒకటి నుంచి 5 తరగతులకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT)కు నిర్వహించే టెట్-1 పేపర్ పరీక్ష, ఆరు నుంచి పదో తరగతి వరక బోధించేందుకు నిర్వహించే పేపర్ 2 పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతల్లో చిన్న చిన్న మార్పులను చేసింది. కొత్త మార్పుల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (DELED), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BELED) చేసిన వారు మాత్రమే పేపర్ 1 పరీక్ష రాసేందుకు అర్హులు.అదే విధంగా ఇంటర్మీడియట్, తత్సమాన విద్యార్హతలో ఓసీ అభ్యర్ధులకు 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది. అయితే ఎస్సీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మినహాయింపునిచ్చింది. అంటే వీరికి 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే TET (టెట్) పరీక్ష నిర్వహణ వ్యయాన్ని కూడా అభ్యర్థుల దరఖాస్తు ఫీజుల నుంచే భరించాలని పేర్కోవడం జరిగింది. ఇక టెట్ పేపర్ – 2 కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులను 40 శాతానికి కుదించడం జరిగింది. అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో టెట్ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతంగా ఉండేది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.