ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు (AP TET Schedule Changes) : ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రాష్ట్రంలో 16 వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 2న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే అభ్యర్థుల వినతి కారణంగా AP TET 2024 షెడ్యూల్లో మార్పులు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP TET 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అప్‌డేట్ చేయబడిన షెడ్యూల్, ముఖ్యమైన తేదీలు, కీలకమైన వివరాలను ఇక్కడ అందించాం.
AP TET 2024 కొత్త షెడ్యూల్ (Revised Schedule for AP TET 2024)
ఏపీ టెట్ 2024 షెడ్యూల్లో జరిగిన మార్పుల వివరాలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.AP TET 2024 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ | జూలై 2, 2024 |
---|---|
AP TET 2024 అప్లికేషన్ ఫీజు చెల్లింపు | ఆగస్ట్ 3వ తేదీ వరకు |
AP TET 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ | ఆగస్టు 3వ తేదీ వరకు |
AP TET 2024 మాక్ టెస్ట్ లభ్యత | సెప్టెంబర్ 19 నుండి |
AP TET 2024 హాల్ టికెట్ డౌన్‌లోడ్ | జూలై 22 నుంచి |
AP TET 2024 పరీక్ష తేదీలు | అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు (రెండు సెషన్లలో) |
AP TET 2024 తాత్కాలిక సమాధానాల కీ విడుదల | అక్టోబర్ 4 |
AP TET 2024 ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు | అక్టోబర్ 5 నుంచి |
AP TET 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల | అక్టోబర్ 27 |
AP TET 2024 ఫలితాల ప్రకటన | నవంబర్ 2 |
ఏపీ టెట్ 2024 దరఖాస్తు విధానం (AP TET 2024 Application Process)
దరఖాస్తు ప్రక్రియ అధికారిక పోర్టల్ https://aptet.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేయడానికి ఇక్కడ దశలు ఉన్నాయి.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in సందర్శించండి.
- దరఖాస్తును పూరింంచాలి. కచ్చితమైన సమాచారంతో అవసరమైన ఫీల్డ్‌లను పూర్తి చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫీజు రూ.750లు చెల్లించండి. పేపర్‌కి, ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- తర్వాత గడువు తేదీలోపు దరఖాస్తును సబ్మిట్ చేయాలి.