AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 (AP TET 90 Marks vs AP DSC Weightage Analysis 2024)

Guttikonda Sai

Updated On: October 03, 2024 01:02 PM

AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు . 
AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు .AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు .

AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ అనాలసిస్ 2024 : AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్నది, జనవరి నెలలో AP DSC పరీక్ష జరగనున్నది. AP DSC పరీక్ష ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల కావడంతో సహజంగానే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు DSC తో పాటుగా TET పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. AP DSC పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ మాత్రం 100 మార్కులకు లెక్కిస్తారు. మెరిట్ లిస్ట్ కోసం లెక్కించే 100 మార్కులలో AP TET వెయిటేజీ 20% ఉంటుంది. AP TET లో సాధించే ప్రతీ మార్కు కూడా అభ్యర్థులకు చాలా కీలకం అవుతుంది. AP TET లో 90 మార్కులు సాధిస్తే DSC లో వెయిటేజీ ఎలా ఉంటుంది అని తెలుసుకోండి.

AP TET లో 90 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 90 Marks vs AP DSC Weightage)

AP TET లో 90 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ అనాలసిస్ క్రింద ఇవ్వబడిన పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

AP DSC లో సాధించిన మార్కులు (80 మార్కులకు)

AP TET లో 90 మార్కులకు పొందిన 20% వెయిటేజీ + AP DSC మార్కులు (100 మార్కులకు)

30 - 39

42 - 51

40 - 49

52 - 61

50 - 59

62 - 71

60 - 69

72 - 81

70 - 79

82 - 91

AP DSC 2024 కోసం AP TET లో 20% వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20% Weightage Marks for AP DSC 2024?)

AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20% వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.

AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 90 ( ఉదాహరణ)
AP DSC లో 20% వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
అంటే (90/150) × 20  = 12

అభ్యర్థి AP TET లో 90 మార్కులు సాధిస్తే అందులో నుండి 12 మార్కులు DSC వెయిటేజీ గా కలుస్తుంది . అభ్యర్థి AP DSC లో 80 మార్కులకు 46 మార్కులు సాధించి, AP TET లో 90 మార్కులు సాధిస్తే AP DSC లో 100 మార్కులకు అతను సాధించే మొత్తం మార్కులు (46+12) = 58

పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-tet-90-marks-vs-ap-dsc-weightage-analysis-2024-58013/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top