AP TET ఎగ్జామ్ డే సూచనలు 2024 (AP TET Exam Day Instructions 2024) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, జూలై సెషన్ AP TET పరీక్షను 2024 అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. AP TET 2024 పరీక్ష 2 గంటల 30 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. ఇందులో మొత్తం 150 మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు ఉంటాయి. ఇది రెండు పేపర్లుగా విభజించబడింది, పేపర్ 1, పేపర్ 2లో వరుసగా ఐదు విభాగాలను కలిగి ఉంటుంది. ఇప్పటికే AP TET 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in ని సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP TET అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ అభ్యర్థి ID, పుట్టిన తేదీని దగ్గరే ఉంచుకోవాలి. AP TET ఎగ్జామ్ రోజున అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు (AP TET Exam Day Instructions 2024) ఈ దిగువున అందించాం.
AP TET పరీక్ష సూచనలు 2024 (AP TET Exam Instructions 2024)
AP TET 2024 పరీక్ష రోజున అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలను ఈ దిగువన అందించాం.- అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒకటిన్నర గంటల ముందుగానే పరీక్షా కేంద్రాల దగ్గరకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల 30 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారిక కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు తీర్చుకోవచ్చు.
- పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డును అంటే ఆధార్ కార్డును, డ్రైవింగ్ , లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డులను తీసుకు వెళ్లాలి.
- దివ్యాంగ అభ్యర్థుల కోసం జిల్లా విద్యాధికారి స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ కేటాయించబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయం కేటాయించడం జరుగుతుంది.
- అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రం పరీక్షకు హాజరు కావాలి.
- రూల్స్‌కు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
- సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలో తీసుకు వెళ్లకూడదు.
- హాల్ టికెట్‌లో ఫోటో లేకపోయినా, సరిగ్గా కనిపించకోయినా, ఫోటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థులు తన సరైన రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లి డిపార్మెంటల్ అధికారికి సబ్మిట్ చేసి అనుమతి పొందాలి.
- అభ్యర్థులు తమ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్మెంటల్ అధికారి దగ్గరున్న నామినల్ ర ోల్స్‌లో సరైన ఆధారాలు చూపించి సరి చేయించుకోవచ్చు.