AP TET జనరల్ కేటగిరీ కటాఫ్ కనీస అర్హత మార్కులు 2024 (AP TET General Category Cutoff Qualifying Marks 2024):
ఏపీలోని పాఠశాలల్లో టీచర్ల పోస్టులకు అర్హతను నిర్ణయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ జూలై సెషన్‌లో AP TET 2024 పరీక్ష జరుగుతోంది. అక్టోబర్ 03వ తేదీ నుంచి AP TET 2024 ప్రారంభమైంది. అక్టోబర్ 20వ తేదీ వరకు జరుగుతోంది. అభ్యర్థులు AP TET 2024 పరీక్షను క్లియర్ చేయడానికి కనీస అర్హత మార్కులు (AP TET General Category Cutoff Qualifying Marks 2024) సాధించాలి. ఈ AP TET అర్హత మార్కులు 2024 BC, OC, SC, ST, PH, Ex-S కేటగిరీలకు భిన్నంగా ఉంటాయి. జనరల్ కేటగిరీల అభ్యర్థులకు AP TET అర్హత మార్కులను ఇక్కడ అందించాం.
AP TET ఫలితాలు 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు AP TET సర్టిఫికెట్ 2024 ఇస్తారు. AP TET పరీక్ష 2024 రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. రెండు పేపర్‌లు ఒక్కొక్కటి ఒక మార్కు చొప్పున మొత్తం 150 మల్టీపుల్ ఆప్షన్స్ ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటాయి. AP TET ఉత్తీర్ణత మార్కులు 2024 ప్రకారం, OC (జనరల్) కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు పొందాలి.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు AP TET క్వాలిఫైయింగ్ మార్కులు (AP TET Qualifying Marks 2024 for OC)
AP TET 2024 ఉత్తీర్ణత శాతం రిజర్వ్, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు భిన్నంగా ఉంటుంది. ఏ కేటగిరీలకు కనీస అర్హత మార్కులు లేదా కటాఫ్‌ని మార్చడం సంబంధిత డిపార్ట్‌మెంట్ ఇష్టంమై ఉంటుంది. డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన AP TET క్వాలిఫైయింగ్ మార్కులు 2024 కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు. ఈ దిగువన ఉన్న కనీస AP TET ఉత్తీర్ణత మార్కులను చూడండి.కేటగిరి | పాస్ పర్సంటేజ్ | అర్హత మార్కులు |
---|---|---|
OC (జనరల్) | 60 | 90 |
BC | 50 | 75 |
SC, ST | 40 | 60 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.