ఏపీ టెట్ హాల్ టికెట్ 2024 (AP TET Hall Ticket 2024) ; అక్టోబర్ 3వ తేదీ నుంచి 20, 2024 వరకు నిర్వహించే AP TET 2024 పరీక్ష హాల్ టిక్కెట్లు (AP TET Hall Ticket 2024) అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కచ్చితమైన పరీక్ష తేదీ, స్లాట్ సమయాలను తెలుసుకోవడానికి వారి హాల్ టికెట్లను పొందాలి. AP TET పరీక్ష 2024 పేపర్ 1 A, పేపర్ 1 B, పేపర్ 2 A, పేపర్ 2 B సెషన్ 1 ఉదయం 9:30 గంటల నుంచి 12:00 గంటల వరకు, సెషన్ 2 పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 గంటల జరుగుతాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు AP TET హాల్ టికెట్ 2024లో తమ పరీక్ష తేదీని, స్లాట్ సమయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. మీ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇక్కడ అందించాం.
AP TET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ (AP TET Hall Ticket 2024 Download link)
AP TET హాల్ టికెట్ 2024ని యాక్సెస్ చేయడానికి డైరెక్ట్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఈ దిగువున అందించాం. ఈ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP TET హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ లింక్ |
---|
AP ET హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థుల AP TET ID, పుట్టిన తేదీ, ధ్రువీకరణ కోడ్ అవసరం అవుతాయి.
AP TET 2024 పరీక్ష రోజు సూచనలు (AP TET 2024 Exam Day Instructions)
AP TEST 2024 పరీక్ష రోజు సూచనలను తెలుసుకోవడానికి, అభ్యర్థులు ఇక్కడ అందించిన వివరాలను తెలుసుకోవాలి.
- పరీక్షా కేంద్రాల వద్ద వెరిఫికేషన్ ప్రక్రియ నిమిత్తం పరీక్షా సమయానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
- అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. లేదంటే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వరు.
- పరీక్ష సమయం ప్రారంభమైనప్పటి నుండి, పరీక్ష ముగిసే వరకు, ఇన్విజిలేటర్ అనుమతి లేకుండా అభ్యర్థులెవరూ తమ నిర్దేశిత సీట్లను విడిచిపెట్డడానికి వీలు ఉండదు.
- పరీక్ష సమయం ముగిసిన తర్వాత మాత్రమే, అభ్యర్థులు AP TEST 2024 పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లవచ్చు.
- ఇంకా, పరీక్షను ప్రారంభించే ముందు, అభ్యర్థులు ఏవైనా పొరపాట్లు జరగకుండా స్క్రీన్‌పై ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష సమయం ముగిసిన వెంటనే అభ్యర్థులు చివరిగా ప్రయత్నించిన సమాధానాలు కూడా దిద్దుబాటు కోసం పరిగణించబడతాయి. సమాధానం లేని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు రావు.