ఏపీ టెట్ హాల్ టికెట్ 2024 తప్పుల కరెక్షన్ (AP TET Hall Ticket Correction 2024) :
AP TET 2024 ఎగ్జామ్ అక్టోబర్ 03వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. ఏపీ టెట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ వెబ్‌సైట్ http://cse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే 2,84,309 మంది అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే హాల్ టిక్కెట్లలో ఏవైనా తప్పులుంటే (AP TET Hall Ticket Correction 2024) ఏం చేయాలని అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం ద్వారా పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్‌లో మార్చుకోవచ్చు. ఇందుకోసం కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 03వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు టెట్ నిర్వహించనున్నారు. ఏమైనా సందేహాలుంటే, అభ్యర్థులు డైరక్టరేట్ కమిషనర్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు. హాల్ టికెట్లలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికి అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286,9963069286, 9398822618 నెంబర్లకు ఫోన్ చేసి అధికారులను సంప్రదించవచ్చు. హాల్ టికెట్లలో ఉన్న తప్పులు సవరించుకోవచ్చు.
అదే విధంగా AP TET 2024 హాల్ టికెట్లలో తప్పులకు సంబంధించిన సందేహాలను grievances.tet@apschooledu.in ఈ మెయిల్ ద్వారా పంపవచ్చని పాఠశాల విద్యా సంచాలకులు వి విజయరామరాజు తెలిపారు. కాగా ఇప్పటికే హాల్‌టికెట్లలో తప్పులకు సంబంధించి తమకు 366 కాల్స్ వచ్చాయని, వాటిలో 287 పరిష్కరించామని అధికారులు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తుదారులు తప్పులు చేశారని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు.
ఏపీ టెట్ 2024 కోసం పరీక్షా కేంద్రాలను పక్క రాష్ట్రాల్లోనూ కూడా కేటాయించారు. ఏపీ టెట్ 2024కు మొత్తం 4, 27, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు 24,396 మంది ఉన్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. అన్ని రకాల ఎడ్య్ుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తలను చూడవచ్చు.