APCOB అప్రెంటిస్ నోటిఫికేషన్ 2024 (APCOB Apprentice Notification 2024) : ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ జిల్లాలో ఈ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లోనే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు https://apcob.org/careers/ వెబ్‌సైట్ చూడొచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్, జీతం వంటి వివరాలను ఇక్కడ అందించాం.
APCOB అప్రెంటిస్ దరఖాస్తు ఫార్మ్ 2024 PDF డౌన్‌లోడ్ (APCOB Apprentice Application Form 2024 PDF Download)
APCOB అప్రెంటిస్ దరఖాస్తు ఫార్మ్ 2024 PDF |
---|
APCOB అప్రెంటీస్ నోటిఫికేషన్ 2024 జిల్లాలో ఖాళీల సంఖ్య (APCOB Apprentice Notification 2024 vacancies in District)
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింద మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనున్నారు.- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 17,
- గుంటూరు జిల్లాలో 7
- చిత్తూరు జిల్లాలో 1 ఖాళీలు
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కింద మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 17, గుంటూరు జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏడాది పాటు అప్రెంటీస్ వ్యవధి ఉంటుంది. నెలకు రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు.
APCOB అప్రెంటీస్ పోస్టుల నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు (APCOB Apprentice Notification 2024 Eligibility Criteria)
APCOB అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన అర్హతలుండాలి.- APCOB అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు సంబంధించి ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు సంబంధించి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. PWD అభ్యర్థులకు సంబంధించి పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
- ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు మీకు రూ.15,000 స్టైండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం కాలం పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు మీకు రూ.15,000 స్టైపండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం కాలం పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకుని, సంబంధిత సమాచారంతో అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అప్లికేషన్‌కు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసి.. దీ డ్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, గవర్నర్ పేట, విజయవాడ అడ్రస్‌కు దరఖాస్తును పంపించాలి. వ్యక్తిగతంగా వెళ్లి దరఖాస్తు చేయాలనుకునే వారు కూడా అదే అడ్రస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.