AP PGCET కౌన్సెలింగ్ షెడ్యూల్ 2024 ( AP PGCET Counselling Schedule 2024) : APSCHE తరపున ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, AP PGCET కౌన్సెలింగ్ 2024 (AP PGCET Counselling Schedule 2024) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆగస్టు 7న ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చివరి తేదీ అంటే ఆగస్టు 12 వరకు AP PGCET కౌన్సెలింగ్‌ను సబ్మిట్ చేయవచ్చు. వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, ఇతర కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్‌ను విశ్వవిద్యాలయం విడుదల చేసింది. వెబ్ కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ pgcet-sche.aptonline.in/APPGCET లో యాక్టివేట్ అయి ఉంది. అదే ఇక్కడ కూడా షేర్ చేయబడింది. విద్యార్థుల సహాయం కోసం వివరణాత్మక మరియు నవీకరించబడిన PPGCET కౌన్సెలింగ్ టైమ్‌టేబుల్ 2024 ఇక్కడ ఉంది.
AP PGCET కౌన్సెలింగ్ తేదీలు 2024: వివరణాత్మక షెడ్యూల్ (APPGCET Counselling Dates 2024: Detailed schedule)
అభ్యర్థులు APPGCET అడ్మిషన్ 2024 కోసం కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలను ఈ దిగువ ఇవ్వబడిన పట్టిక ద్వారా సూచించవచ్చు:
AP PGCET కౌన్సెలింగ్ ఈవెంట్‌లు | తేదీలు |
---|---|
కౌన్సెలింగ్ నమోదు ప్రారంభం | ఆగస్టు 7, 2024 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఆగస్టు 12, 2024 |
అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | ఆగస్టు 8 నుండి 19, 2024 వరకు |
AP PGCET వెబ్ ఆప్షన్ల సమర్పణ | ఆగస్టు 21 నుండి 23, 2024 వరకు |
వెబ్ ఆప్షన్లను సవరించడానికి చివరి తేదీ | ఆగస్టు 24, 2024 |
రౌండ్ 1 సీటు కేటాయింపు 2024 | ఆగస్టు 28, 2024 |
అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ | ఆగస్టు 29 నుండి 31, 2024 వరకు |
తరగతుల ప్రారంభం | ఆగస్టు 29, 2024 |
APPGCET కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్ 2024 |
అకడమిక్ సెషన్ ఆగస్టు 29న ప్రారంభమవుతుంది. అయితే ఆ తర్వాత కూడా వరుసగా APPGCET కౌన్సెలింగ్ రౌండ్‌లు కొనసాగుతాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ విండోలో, రిజర్వ్ చేయబడిన కేటగిరీల అభ్యర్థులు, ఏదైనా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందే అభ్యర్థులు వారి అర్హత కోసం చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌లను సబ్మిట్ చేయాలి. APSCHE అటువంటి అభ్యర్థుల స్థితిని ధ్రువీకరిస్తుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వారిని ఆమోదిస్తుంది.
అంతేకాకుండా, దరఖాస్తుదారులు నమోదు చేసుకోవడానికి వారి AP PGCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాలి. ముందుగా అభ్యర్థులు తమ భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి తప్పనిసరిగా రూ. 700 (SC/ST/PwD కోసం రూ. 500) ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు తిరిగి చెల్లించబడదు. ఒకసారి చెల్లించిన తర్వాత బదిలీ చేయబడదు.