ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024 అబ్జెక్షన్ విండో (APPSC Group 1 Answer Key 2024 Objection Window) : APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీ 2024 మార్చి 19, 2024న వెబ్‌సైట్ psc.ap.gov.inలో విడుదలైంది. APPSC గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 17, 2024న 2 షిఫ్ట్‌లలో జరిగింది. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను (APPSC Group 1 Answer Key 2024 objection window) తెలియజేయవచ్చు. ఇలా అభ్యంతరాలను తెలియజేయడానికి రేపే అంటే మార్చి 21, 2024 చివరి తేదీ. APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దాదాపు 1,48,881 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 1,26,068 మంది అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17, 2024న, రెండు షిఫ్ట్‌లలో జరిగిన ఈ పరీక్షకు 91,463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే పరీక్ష రోజున 72.55 శాతం హాజరు నమోదైంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అబ్జెక్షన్ విండో 2024 (APPSC Group 1 Objection Window)
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అబ్జెక్షన్ విండో లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
---|
APPSC గ్రూప్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download APPSC Group 1 Provisional Answer Key 2024)
APPSC ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి దిగువున ఇవ్వబడిన స్టెప్లను అనుసరించండి.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు APPSC గ్రూప్ 1 అధికారిక వెబ్‌సైట్‌ను psc.ap.gov.in సందర్శించండి.
- స్టెప్ 2: : గ్రూప్-I సర్వీసెస్ నోటిఫికేషన్ నెం.12/2023 పోస్ట్‌కి స్క్రీనింగ్ పరీక్షలో ప్రారంభ కీ - (18/03/2024న ప్రచురించబడింది) - ఇక్కడ క్లిక్ చేయండి" అని ఉన్న నోటీసుపై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: అన్ని పేపర్ల కోసం APPSC జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: APPSC జవాబు కీ PDF మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
- స్టెప్ 5: APPSC ఆన్సర్ కీ 2024 PDFని డౌన్‌లోడ్ చేయండి.
APPSC గ్రూప్ 1 ఆన్సర్ కీకి వ్యతిరేకంగా అభ్యంతరాలను తెలియజేసే విధానం (Steps to Raise Objections Against APPSC Group 1 Answer Key)
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఈ దిగువున తెలిపిన విధంగా తెలియజేయాలి.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు APPSC పోర్టల్‌కి https://portal-psc.ap.gov.in/Default.aspxని సందర్శించాలి.
- స్టెప్ 2: హోంపేజీలో “ATTENTION:: Screening test to the post of Group-I Services Notification No.12/2023 - Accepting Objections - On Initial Keys - (Published on 19/03/2024) - అనే క్యాప్షన్‌పై క్లిక్ ేయండి.
- స్టెప్ 3: తర్వాత APPSC అభ్యంతరాల విండో మీ స్క్రీన్‌పై తెరవబడుతుంది.
- స్టెప్ 4: “User ID”, “Mobile Number”, “Captcha” ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్టెప్ 5: మీ దగ్గరున్న సమాధానానికి వ్యతిరేకంగా మీ అభ్యంతరాన్ని సమర్పించండి.
APPSC ఆన్సర్ కీ నోటీసులో “పోస్ట్/WhatsApp/SMS/ఫోన్/వ్యక్తిగత సమర్పణల ద్వారా అభ్యంతరాలు ఆమోదించబడవు లేదా గడువు తేదీ తర్వాత స్వీకరించబడిన ఏవైనా ఇతర మోడ్, అభ్యంతరాలు పరిగణించబడవు. అదే విధంగా మీ అభ్యంతరాన్ని సమర్పించడానికి మీరు ఫీజు చెల్లించాలి ఆ విషయాన్ని నిర్ధారించుకోండి. అభ్యంతర ఫీజు తిరిగి చెల్లించబడదు.