ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 ( APPSC Group 1 Result 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) గ్రూప్ 1 అభ్యర్థులకు పరీక్షల ప్రక్రియను పూర్తి చేసింది. గ్రూప్ 1 అభ్యర్థులు జనవరి 8, 2023 తేదీన తమ పరీక్షలు వ్రాశారు. అధికారులు త్వరలో ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను ( APPSC Group 1 Result 2023)విడుదల చేయనున్నారు. ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అక్టోబర్ 2022 లో మొత్తం 92 పోస్టులకు నోటిికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 2023 లో వారి పరీక్షలకు హాజరు అయ్యారు. కేవలం 92 పోస్టులకు కొన్ని వేల మంది అభ్యర్థులు హాజరు అవ్వడంతో గ్రూప్ 1 పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఫలితాలు( APPSC Group 1 Result 2023) విడుదల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. జనవరి నెల చివరి వారంలో ఈ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీలు2023 ( APPSC Group 1 Result Dates 2023)
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాల పూర్తి సమాచారం క్రింది పట్టిక లో గమనించవచ్చు.
రిక్రూట్మెంట్ అధారిటీ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
---|---|
పరీక్ష పేరు | గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష |
మొత్తం ఖాళీలు | 92 |
ఫలితాలు విడుదల తేదీ | జనవరి 2023 చివరి వారం |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2023 చెక్ చేసుకోవడం ఎలా? ( How to Check APPSC Group 1 Result 2023)
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను( APPSC Group 1 Result 2023) ఈ క్రింద వివరించిన స్టెప్స్ అనుసరించి చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి ఫలితాలను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అవసరం అవుతాయి.- ఏపీపిఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ఓపెన్ చేయండి.
- ఇక్కడ " Announcements " మీద క్లిక్ చేయండి.
- అనౌన్స్మెంట్ లిస్ట్ లో ఉన్న " APPSC Group 1 Result " మీద క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పూర్తి చేసిన తర్వాత " Submit " మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం మీ ఫలితాన్ని సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 కటాఫ్ మార్కులు 2023 - అంచనా ( APPSC Group 1 Expected Cutoff score 2023)
ఏపీపిఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ మార్కులు (అంచనా) ఈ క్రింది పట్టిక లో కేటగిరీ ప్రకారంగా వివరించబడింది.కేటగిరీ | కటాఫ్ మార్కులు ( అంచనా) |
---|---|
జనరల్ | 114-120 |
BC | 109-114 |
SC/ST | 100-109 |
ఈ పట్టిక లో ఇచ్చిన కటాఫ్ మార్కులు అంచనా మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి.
ఏపీపిఎస్సీ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.