APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 వాయిదా, మళ్లీ పరీక్ష ఎప్పుడంటే? (APPSC Group 2 Exam Date 2024 Postponed)

Andaluri Veni

Updated On: November 13, 2024 10:45 AM

APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 వాయిదా (APPSC Group 2 Exam Date 2024 Postponed) పడింది. ముందు షెడ్యూల్ ప్రకారం పీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షను జనవరి 5, 2025న జరగాల్సి ఉంది. మళ్లీ ఆ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ అందించాం. 

 
APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 వాయిదా, మళ్లీ పరీక్ష  ఎప్పుడంటే?  (APPSC Group 2 Exam Date 2024 Postponed)APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 వాయిదా, మళ్లీ పరీక్ష ఎప్పుడంటే? (APPSC Group 2 Exam Date 2024 Postponed)

APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ 2024 వాయిదా (APPSC Group 2 Exam Date 2024 Postponed) : APPSC గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ 2024ని వాయిదా (APPSC Group 2 Exam Date 2024 Postponed) పడింది. గ్రూప్ II సర్వీసెస్ (నోటిఫికేషన్ నం.11/2023) కోసం మెయిన్స్ రాత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌లో psc.ap.gov.in. అధికారిక ప్రకటనను చెక్ చేయవచ్చు. ముందు షెడ్యూల్ ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షను జనవరి 5, 2025న నిర్వహించాల్సి ఉండగా అది ఫిబ్రవరి 23, 2025కి వాయిదా పడింది.

అయితే ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్.. సీఎం చంద్రబాబను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా  ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడడం ఇది రెండోసారి. ముందుగా జూలైలో, పరీక్షను జూలై 28, 2024న నిర్వహించాల్సి ఉంది, కానీ వాయిదా పడింది . పరిపాలనా కారణాల వల్ల పరీక్షను వాయిదా వేసినట్లు కమిషన్ వెల్లడించింది.

వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 900 ఖాళీల భర్తీకి ఈ పరీక్ష జరుగుతోంది. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 1327 వేదికల్లో ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకే షిప్టులో జరిగింది. ప్రిలిమినరీ ఫలితం ఏప్రిల్ 10, 2024న ప్రకటించడం జరిగింది.

APPSC గ్రూప్ 2 మెయిన్ పరీక్ష 2024 నోటీసును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (APPSC Group 2 Main Exam 2024: How to Download notice)

APPSC గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించిన అధికారిక ప్రకటనను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దిగువ ఇచ్చిన దశలను అనుసరించవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు  psc.ap.gov.inలో APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న APPSC గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ 2024 వెబ్ నోట్‌పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు వివరాలను చెక్ చేసే కొత్త PDF ఫైల్ తెరవబడుతుంది.
  • పేజీని డౌన్‌లోడ్ చేయాలి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోవాలి.

APPSC గ్రూప్ 2  ఎగ్జామ్ డేట్ 2024 ఓవర్ వ్యూ (APPSC Group 2 Exam Date 2024 Overview)

APPSC గ్రూప్ 2  ఎగ్జామ్‌కు సుమారు ఒక లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని అంచనా వేయబడింది. రాబోయే DSC పరీక్ష, SSC, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పరిగణనలోకి తీసుకుని తేదీని నిర్ణయించారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కింద ఇన్‌స్పెక్టర్ల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు ఈ దిగువున అందించాం.

సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ పేరు గ్రూప్-II సర్వీసెస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ తహశీల్దార్ (గ్రూప్ II), సబ్-రిజిస్ట్రార్ గ్రూప్ 2, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్.
పోస్ట్‌ల సంఖ్య 905
కొత్త పరీక్ష తేదీ ఫిబ్రవరి 23, 2024
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ పరీక్ష/మెయిన్స్ పరీక్ష/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
హాల్ టికెట్ స్థితి తెలియాల్సి ఉంది
అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-mains-exam-date-2024-postponed-59557/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top