ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల తేదీ 2024 (APPSC Group 2 Result Date 2024) :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఫిబ్రవరి 25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకే షిప్టులో పరీక్ష జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు (APPSC Group 2 Result Date 2024) వారం రోజుల్లో విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ తెలియజేశారు. అయితే కచ్చితమైన తేదీ, సమయం అధికారికంగా నిర్ధారించ లేదు. APPSC గ్రూప్ 2 పరీక్ష ఆన్సర్ కీ పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 26న జారీ అయింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను ఫిబ్రవరి 27 మరియు 29 మధ్య ఆహ్వానించారు.
ఈ సంవత్సరం మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా వారిలో 4,63,517 మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులో 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో మొత్తం హాజరు 87.17 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు. APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జూన్-జూలై, 2024లో షెడ్యూల్ చేయబడింది. APPSC గ్రూప్ 2 పరీక్ష మొత్తం 897 ఖాళీలను భర్తీ చేస్తుంది.
APPSC గ్రూప్ 2 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How To Download APPSC Group 2 Result)
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలని PDFని (APPSC Group 2 Result Date 2024) డౌన్‌లోడ్ చేయడానికి ఈ దిగువన ఇచ్చిన స్టెప్స్‌ని ఫాలో అవ్వండి.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక APPSC వెబ్‌సైట్‌కి psc.ap.gov.in వెళ్లాలి.
- స్టెప్ 2: హోంపేజీలో “ప్రకటనలు” అనే ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: “APPSC గ్రూప్ 2 ఫలితం” లింక్ కోసం శోధించి, దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితం PDF డెస్క్‌టాప్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 5: భవిష్యత్ సూచన కోసం తుది మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.