ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 ఫలితాలు (APPSC Group-2 Prelims 2024 Results) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ఖాళీల కోసం రాత పరీక్షను నిర్వహించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25న గ్రూప్ 2 సర్వీసుల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫైనల్ కీ కూడా వచ్చేసింది. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్ ఫలితాల (APPSC Group-2 Prelims 2024 Results) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉంది. అతి త్వరలో గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షల ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారి వెల్లడించారు. ఈ మేరకు పరీక్ష బోర్డు అంటే APPSC, psc.ap.gov.inలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేస్తుంది.
APPSC గ్రూప్ 2 ఫలితం 2024: చెక్ చేసుకునే విధానం (APPSC Group 2 Result 2024: Steps To Check)
2024లో APPSC గ్రూప్-2 ఫలితాలు (APPSC Group-2 Prelims 2024 Results) విడుదలైన తర్వాత, అభ్యర్థులు ఈ దిగువ అందించిన దశలను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను తెలుసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు psc.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలో 'APPSC వెబ్‌సైట్' అని చదివే లింక్"ని క్లిక్ చేయాలి.
- తర్వాత APPSC ప్రాథమిక పేజీకి రీ డైరక్ట్ అవుతారు.
- అక్కడ 'APPSC గ్రూప్ 2 ఫలితం 2024' లింక్‌ని గుర్తించండి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
- APPSC 2024 ఫలితం మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- మీ భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు రాష్ట్రంలో మొత్తం 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 4,63,517 మంది పరీక్ష రాసేందుకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. కానీ 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఇక.. ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్‌ను జూన్/జులైలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పకప్పుడు తాజా అప్‌డేట్లను ఇక్కడ పొందండి.