ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024 (APPSC Group 2 Prelims Result 2024) : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. సంబంధిత అధికారులు మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో psc.ap.gov.in విడుదల చేశారు. ఈ ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఇక్కడ అందించాం. జూలై 28 గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్ష 25 ఫిబ్రవరి 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 24 జిల్లాల్లోని 1327 వేదికల్లో పరీక్ష జరిగింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల PDF లింక్
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల PDF లింక్- ఇక్కడ క్లిక్ చేయండి |
---|
APPSC గ్రూప్ 2 పరీక్ష ఓవర్ వ్యూ (APPSC Group 2 Exam Overview)
- ప్రిలిమ్స్ పరీక్ష OMR ఆధారిత పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగింది.
- ప్రశ్నపత్రంలో 150 MCQ తరహా ప్రశ్నలు ఇచ్చారు.
- అభ్యర్థుల జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు.
- అభ్యర్థులు పేపర్‌ను పూర్తి చేయడానికి 150 నిమిషాల సమయం ఇచ్చారు.
- తప్పు సమాధానాలకు 1/3 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024ని చెక్ చేసుకునే విధానం (Steps to Check APPSC Group 2 Prelims Result 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఇక్కడ అందించిన లింక్, విధానాన్ని ఉపయోగించి వాటిని చెక్ చేయవచ్చు.- ముందుగా psc.ap.gov.in వెబ్‌సైట్‌ను వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి.
- హోంపేజీలో APPSC వెబ్‌సైట్, OTPR, ఇతర అనేక ఎంపికల జాబితా కనిపిస్తుంది.
- అందులో APPSC వెబ్‌సైట్‌ను ఎంచుకోండి.
- మీరు మెయిన్‌కి రీ డైరక్ట్ అవుతారు. అక్కడ ఫలితాన్ని చెక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది..
- ఫలితాన్ని చెక్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర వివరాలను అందించాలి. దాంతో ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చూసుకోవచ్చు.
అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు అర్హులవుతారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష కోసం కమిషన్ 15 సార్లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.