ఏపీ ఆర్జేసీ సెట్ 2023 నోటిఫికేషన్ (APRJC CET 2023 Notification):
APRJC CET 2023 అధికారిక నోటిఫికేషన్ (APRJC CET 2023 Notification) ఏప్రిల్ 04, 2023న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, అమరావతి ఈ నోటిఫికేషన్‌ను (APRJC CET 2023 Notification) రిలీజ్ చేసింది. APRJC CET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా APRJ CET ఆన్‌లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 12, 2023వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. పరీక్షా ఫలితాలు జూన్, 2023లో రిలీజ్ అవుతాయి. ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌కు డైరక్ట్ లింక్ |
---|
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. పదో తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు APRJC CET 2023 పరీక్షకు హాజరు అవ్వొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఈ APRJC CET 2023ని నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఆర్జేసీ సెట్ 2023లో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు అతి తక్కువ ఫీజుతో గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 హైలెట్స్ (AP RJC CET 2023 Highlights)
ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.పరీక్ష పేరు | ఏపీ ఆర్జేసీ సెట్ 2023 |
---|---|
పరీక్ష పూర్తి పేరు | ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |
కేటగిరి | జూనియర్ కాలేజ్ లెవల్ |
ఎగ్జామ్ మోడ్ | ఆఫ్‌లైన్ |
అప్లికేషన్ ఫీజు | రూ.250 |
ఎగ్జామ్ డ్యురేషన్ | 2 గంటల 30 నిమిషాలు |
మొత్తం ప్రశ్నలు | 150 ప్రశ్నలు, 150 మార్కులు |
మీడియం | ఇంగ్లీష్ |
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2023 Important Dates)
ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఏప్రిల్ 04, 2023 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 24, 2023 |
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 హాల్ టికెట్ | మే 12, 2023 |
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 ఎగ్జామ్ డేట్ | మే 20, 2023 |
ఆన్సర్ కీ విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
ఫలితాల విడుదల తేదీ | జూన్ 08, 2023 |
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 అర్హత ప్రమాణాలు (APRJC CET 2023 Eligibility Criteria)
APRJC CET 2023కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ కింద ఇచ్చిన అర్హతలు కచ్చితంగా ఉండాలి.- ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి
- అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుని ఉండాలి
- దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ ఏడాది అంటే 2022-23లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
- గత సంవత్సరాల్లో పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీ ఆర్జేసీ సెట్ 2023 రాసేందుకు అవకాశం లేదు.
ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో aprs.apcfss.in పూర్తి వివరాలు చూడొచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.