APRJC హాల్ టికెట్లు 2024 ఈరోజు అంటే ఏప్రిల్ 17వ తేదీన విడుదలయ్యాయి. APREIS ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్లను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో
aprs.apcfss.in
రిలీజ్ చేసింది. అక్కడ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. APRJC సెట్ 2024 పరీక్ష ఏప్రిల్ 21, 2024న జరగనుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు కచ్చితంగా హాల్ టికెట్లను తీసుకెళ్లాలి. APRJC సెట్ పరీక్షా కేంద్రం దగ్గర అభ్యర్థి గుర్తింపునకు పని చేస్తుంది. ఏపీఆర్జేసీ హాల్ టికెట్లు విడుదలైన తర్వాత సంబంధిత లింక్ ఇక్కడ జోడిస్తాం. అభ్యర్థులు ఇక్కడ నుంచి నేరుగా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి:
ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ 2024 విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్ లింక్ 2024 (APRJC Hall Ticket Link 2024)
ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్ లింక్ 2024 |
---|
ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్లను 2024 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (APRJC CET Hall Ticket 2024 Download)
APRJC ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించాం.
- ముందుగా అభ్యర్థులు మీ బ్రౌజర్‌లో APREIS అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.in ని సందర్శించాలి.
- మీరు అడ్మిషన్ వెబ్‌సైట్‌కి చేరుకున్న తర్వాత హోంపేజీలో APRJC ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత APRJC CET హాల్ టికెట్ చెకింగ్ వెబ్ పేజీ కనిపిస్తుంది. ఆ పేజీలో లాగిన్ వివరాలను నమోదు చేసి, గెట్ హాల్ టికెట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీ APRJC CET హాల్ టికెట్ కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
- భవిష్యత్తు సూచన కోసం దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అడ్మిషన్ కౌన్సెలింగ్ సమయాల్లో అది అవసరం అవుతుంది.
APRJC 2024 సెట్ ముఖ్యమైన సూచనలు
APRJC CET 2024కి హాజరవుతున్నప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా ఈ దిగువున ఇచ్చిన సూచనలను అనుసరించాలి.- అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
- అభ్యర్థులు తప్పనిసరిగా APRJC CET హాల్ టికెట్ 2024తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- పరీక్ష హాల్ లోపల మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
- అభ్యర్థులు APRJC CET హాల్ టికెట్ 2024 మినహా ఎలాంటి పాఠ్యాంశాలు, ముద్రించిన లేదా రాసిన, కాగితపు బిట్‌లు లేదా మరే ఇతర మెటీరియల్‌ను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడానికి అనుమతించబడరు.
- అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తప్పనిసరిగా APRJC CET హాల్ టికెట్ 2024ని భద్రపరచుకోవాలి.