ఏపీ కామన్ ఎంట్రన్స్ సెట్‌ల షెడ్యూల్ విడుదల (APSCHE releases schedule for CET 2023): ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి (Andhra Pradesh State Council of Higher Education-APSCHE) విడుదల చేసింది. పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీజీ సెట్, ఆర్ సెట్ల పరీక్షా తేదీలను APSCHE (APSCHE releases schedule for CET 2023) ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో
apsche.ap.gov.in
సంబంధిత ప్రకటనను చూడొచ్చు.
ఇది కూడా చదవండి:
జేఈఈ మెయిన్ షిప్ట్ 2లో ఏ సబ్జెక్ట్ కఠినంగా ఉంది.?
ఏపీ ప్రవేశ పరీక్షల ముఖ్యమైన తేదీలు (APSCHE 2023 CET Examination Schedule)
APSCHE విడుదల చేసిన షెడ్యూల్ (APSCHE releases schedule for CET 2023) ప్రకారం ఏపీ ప్రవేశ పరీక్షలు (AP EAPCET, AP ECET, AP LAWCET, AP EDCET, AP ICET) జరిగే ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించ వచ్చు.ప్రవేశ పరీక్ష | కోర్సులు | తేదీలు |
---|---|---|
ఏపీ ఈసెట్ |
ఇంజనీరింగ్
| మే 5 |
ఏపీ లాసెట్ |
బీంఎల్, ఎంఎల్
| మే 20 |
ఏపీ ఎడ్‌సెట్ |
బీఈడీ
| మే 20 |
ఏపీ ఐసెట్ |
ఎంబీఏ, ఎంసీఏ
| మే 25, 26 |
ఏపీ పీజీ ఈసెట్ |
ఎంసెట్, ఎంఫార్మసీ
| మే 28-30 |
ఏపీ పీజీ సెట్ |
పీజీ
| జూన్ 6-10 |
ఏపీ ఆర్ సెట్ |
పీహెచ్‌డీ
| జూన్ 12-14 |
ఏపీ లాసెట్ 2023 (AP LAW CET 2023)
లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ లాసెట్ 2023 (AP LAW CET 2023) నిర్వహించడం జరుగుతుంది. ఏపీ లాసెట్ 2023ను మే 20వ తేదీన నిర్వహించనున్నట్టు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ లాసెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న లా కాలేజీలు, లా యూనివర్సిటీల్లో న్యాయ విద్యకు సంబంధించే గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు.ఇది కూడా చదవండి: ఏపీ ఈసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ
ఏపీ ఎడ్‌సెట్ 2023 (AP EDCET 2023)
బీఈడీ (BEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ ఎడ్‌సెట్ 2023 (AP EDCET 2023) నిర్వహిస్తారు. ఈ పరీక్ష మే 20న జరగనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ కల్పించడం జరుగుతుంది. ఈ టెస్ట్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానం ఇవ్వాలి. ఈ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లోనే ఉంటుంది.ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023)
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ ఐసెట్ 2023ని (AP ICET 2023) నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఐసెట్ పరీక్షలు 2023 మే 25 నుంచి 26 తేదీల్లో జరగనున్నాయి. ఈ టెస్ట్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. రెండున్నర గంటల వ్యవధిలో 200 ప్రశ్నాలకు సమాధానం ఇవ్వాలి.ఏపీ పీజీఈసెట్ 2023 (AP PGECET 2023)
ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి ఏపీ పీజీఈసెట్ 2023ను ( AP PGECET 2023) నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ సెట్ 2023 మే 28 నుంచి 30 తేదీల మధ్య జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలకు రెండు గంటల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.ఏపీ పీజీసెట్ 2023 (AP PGCET 2023)
ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ పీజీసెట్ 2023ను ( AP PGCET 2023) నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష 2023 జూన్ 6 నుంచి 10వ తేదీల మధ్య జరగనుంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.ఆర్ సెట్ 2023 (AP R CET 2023)
యూనివర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఆర్‌సెట్ 2023ను (R CET 2023) నిర్వహిస్తారు. ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 14వ తేదీల మధ్య నిర్వహించనున్నట్టు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ ఆర్‌సెట్ అడ్మిషన్ ప్రక్రియ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. కేటగిరి I అభ్యర్థులకు 30 మార్కులకు, కేటగిరి II అభ్యర్థులకు 60 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.ఏపీ ఈసెట్ 2023 (AP ECET 2023)
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించేందుకు ఏపీ ఈసెట్ 2023ని (AP ECET 2023) నిర్వహిస్తారు. ఏపీ ఉన్నత విద్యా మండలి రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ ఈసెట్ 2023 మే 5వ తేదీ నుంచి జరగనున్నాయి.ఇది కూడా చదవండి: ఏపీ ఈసెట్ 2023 షెడ్యూల్ విడుదల
ఏపీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ College Dekhoని ఫాలో అవ్వండి