AP TETలో 124 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 124 Marks vs AP DSC Weightage Analysis 2024) : AP TETలో 124 మార్కులు vs AP DSC వెయిటేజీ పూర్తి విశ్లేషణను 2024 (AP TET 124 Marks vs AP DSC Weightage Analysis 2024) ఇక్కడ అందించాం. AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలైంది. వేలాది మంది అభ్యర్థులు AP TET 2024కి హాజరవుతున్నారు. జనవరి నెలలో AP DSC పరీక్ష జరగనుంది. AP DSC ద్వారా మొత్తం 16 వేలకు పైగగా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పరీక్షకు పోటీ తీవ్రంా ఉంది. కాబట్టి అభ్యర్థులు DSC తో పాటుగా TET పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించాల్సి ఉంటుంది. AP DSC పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ మాత్రం 100 మార్కులకు లెక్కిస్తారు. మెరిట్ లిస్ట్ కోసం లెక్కించే 100 మార్కుల్లో AP TET వెయిటేజీ 20 శాతం ఉంటుంది.
AP TET లో 124 మార్కులు vs AP DSC వెయిటేజీ (AP TET 124 Marks vs AP DSC Weightage)
AP TETలో 124 మార్కులకు DSC మెరిట్ లిస్ట్ అనాలసిస్ కింద ఇచ్చిన టేబుల్లో వివరంగా తెలుసుకోవచ్చు.AP TETలో సాధించిన మార్కులు | మెరిట్ జాబితాలో AP టెట్ స్కోర్ వెయిటేజీ | DSCలో సాధించిన మార్కులు | మెరిట్ లిస్ట్‌లో మొత్తం మార్కులు |
---|---|---|---|
124 | 16.53 | 30 | 46.53 |
124 | 16.53 | 35 | 51.53 |
124 | 16.53 | 40 | 56.53 |
124 | 16.53 | 45 | 61.53 |
124 | 16.53 | 50 | 66.53 |
124 | 16.53 | 55 | 71.53 |
124 | 16.53 | 60 | 76.53 |
124 | 16.53 | 65 | 81.53 |
124 | 16.53 | 70 | 86.53 |
124 | 16.53 | 75 | 91.53 |
124 | 16.53 | 80 | 96.53 |
AP DSC 2024 కోసం AP TETలో 20 శాతం వెయిటేజీ మార్కులను ఎలా లెక్కిస్తారు ? (How to Calculate APTET 20 శాతం Weightage Marks for AP DSC 2024?)
AP DSC పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహించబడుతుంది, మరో 20 మార్కులు AP TET పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను 20 శాతం వెయిటేజీ లెక్కించి DSC మార్కులకు కలుపుతారు. ఈ మార్కులను లెక్కించే విధానం ఈ కింద వివరంగా తెలుసుకోవచ్చు.
- AP TET పరీక్ష మొత్తం మార్కులు : 150
- AP TET పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు : 124 ( ఉదాహరణ)
- AP DSCలో 20 శాతం వెయిటేజీ కోసం ఫార్ములా : ( అభ్యర్థి సాధించిన మార్కులు / మొత్తం మార్కులు) × 20 = వెయిటేజీ మార్కులు
- అంటే (124/150) × 20 = 16.53
పైన ఇవ్వబడిన విధంగా AP DSC కోసం AP TET వెయిటేజీ మార్కులను లెక్కిస్తారు .