CTET ఎగ్జామ్ డేట్ 2024 మారింది (CTET Exam Date 2024 Revised) :
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET డిసెంబర్ 2024 పరీక్ష తేదీని మార్చింది. అభ్యర్థులు CBSE సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో సవరించిన కొత్త తేదీని చెక్ చేయవచ్చు. ముందుగా డిసెంబర్ 15, 2024న షెడ్యూల్ చేయబడిన CTET పరీక్ష ఇప్పుడు డిసెంబర్ 14, 2024న నిర్వహించబడుతుంది. వివిధ అభ్యర్థుల అభ్యర్థన మేరకు బోర్డు CTET 2024 తేదీని సవరించాలనే నిర్ణయం తీసుకుంది. 15 డిసెంబర్ 2024 (ఆదివారం)న కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబడింది. ఏ నగరంలోనైనా దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే, డిసెంబర్ 15న కూడా పరీక్ష నిర్వహించవచ్చని బోర్డు పేర్కొంది.
అధికారిక నోటీసు ప్రకారం కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 15, 2024న (ఆదివారం) కొన్ని పోటీ పరీక్షలు ఉన్నందున అభ్యర్థుల కోరిక మేరకు CTET పరీక్షను 14 డిసెంబర్ 2024న (శనివారం) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. CTET డిసెంబర్ 2024 పరీక్ష తేదీని CBSE సవరించడం ఇది రెండోసారి. పరీక్ష గతంలో డిసెంబర్ 1న జరగాల్సి ఉండగా, గత నెల 15, 2024కి వాయిదా పడింది. కాగా CTET డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 2024.
జనరల్/OBC కేటగిరి అభ్యర్థులకు పేపర్ I, IIలకు పరీక్ష ఫీజు కేవలం కి రూ.1000లు, రూ.1200లు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు I లేదా II పేపర్‌లకు రూ. 500లు, రూ.600లు ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
CTET 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (HOW TO APPLY FOR CTET 2024)
CTET 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.- అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- 'కొత్త నమోదు' లింక్‌పై క్లిక్ చేయండి. మీ పేరు, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నెంబర్ వంటి అవసరమైన వివరాలను పూరించండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను స్వీకరించడానికి పాస్‌వర్డ్‌ను సృష్టించండి. దరఖాస్తును సబ్మిట్ చేయండి.
- మీ ఖాతాకు లాగిన్ చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.
- కచ్చితమైన వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారంతో CTET దరఖాస్తును పూరించాలి. పరీక్ష నగరం, సబ్జెక్ట్ ప్రాధాన్యతను ఎంచుకోవాలి.
- పేర్కొన్న ఫార్మాట్, పరిమాణ మార్గదర్శకాల ప్రకారం మీ ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేచయాలి.
- చెల్లింపు పద్ధతిని ఎంచుకోవాలి. (క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు). వర్తించే ఫీజును చెల్లించాలి. భవిష్యత్ సూచన కోసం రసీదుని ఉంచాలి.
- నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని సమీక్షించాలి. ఏవైనా అవసరమైన దిద్దుబాట్లు చేయండి. దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత మీ రికార్డుల కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.