సీయూఈటీ యూజీ 2023 ముఖ్యమైన తేదీలు: సీయూఈటీ యూజీ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 9, 2023న UGC ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తన అధికారిక Twitter ఖాతాలో CUET 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని ప్రకటించారు. సీయూఈటీ 2023కి సంబంధించిన పరీక్షా తేదీలను ముందుగా NTA వెల్లడించింది. సీయూఈటీ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఈరోజు సాయంత్రం నాటికి విడుదలవుతుంది. ఫిబ్రవరి 09వ తేదీన cuet.samarth.ac.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ అవ్వగా మార్చి 12, 2023 వరకు అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది.
కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ద్వారా 2022లో ప్రవేశపెట్టిన పరీక్ష. ఈ ప్రవేశ పరీక్షను NTA నిర్వహిస్తుంది. CUET UG దేశంలోని ఏదైనా సెంట్రల్ యూనివర్శిటీలో అడ్మిషన్‌ని కోరుకునే విద్యార్థులందరికీ సీయూఈటీ యూజీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ, బీఏ, బీకాం మొదలైన వివిధ కోర్సులలో అభ్యర్థులకు ప్రవేశాలను కల్పిస్తుంది.
సీయూఈటీ యూజీ 2023 నోటిఫికేషన్: ముఖ్యమైన తేదీలు
సీయూఈటీ యూజీ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువ పట్టికలో అందించడం జరిగింది.
ఈవెంట్ | తేదీలు |
---|---|
షెడ్యూల్ విడుదల | ఫిబ్రవరి 09, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ప్రారంభం | ఫిబ్రవరి 09, 2023 (సాయంత్రం) |
అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ముగింపు | మార్చి 12, 2023 |
అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల | ఏప్రిల్ 30, 2023 |
హాల్ టికెట్ విడుదల | మే 2023 రెండో వారం |
CUET పరీక్ష తేదీ 2023 | మే 21 నుండి 31, 2023 వరకు |
సీయూఈటీ 2023 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
సీయూఈటీ 2023కి సంబంధించిన షెడ్యూల్‌తో పాటు, ఎంట్రన్స్ పరీక్ష ముఖ్యాంశాలు ఈ కింద తెలియజేయడం జరిగింది.
- సీయూఈటీ యూజీ 2023ని కంప్యూటర్ -బేస్డ్ టెస్ట్ (CBT)గా నిర్వహిస్తుంటారు. పరీక్షా కేంద్రాల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో టెస్ట్‌ని నిర్వహిస్తారు.
- క్వశ్చన్ పేపర్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను (MCQలు)ను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు.
- సీయూఈటీ అప్లికేషన్ ఫార్మ్ 2023తో పాటు అభ్యర్థులకు సమాచార బ్రోచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులకు కావలసిన విశ్వవిద్యాలయం గురించి, అర్హతలు, కోర్సులు గురించి తెలుసుకోవచ్చు.
-
సీయూఈటీ యూజీ మూడు విభాగాలను కలిగి ఉంటుంది:
- సెక్షన్ IA – 13 భాషల్లోని ఆప్షన్‌లతో లాంగ్వేజ్ సెక్షన్
- సెక్షన్ IB – 20 భాషల్లోని ఆప్షన్‌లతో లాంగ్వేజ్ సెక్షన్
- సెక్షన్ II – 27 సబ్జెక్ట్ ఆప్షన్స్‌తో డొమైన్-నిర్దిష్ట సబ్జెక్ట్‌ల విభాగాలు
- సెక్షన్ III – జనరల్ టెస్ట్
- IA, IB, II విభాగాలు ఆప్షనల్ అయితే సెక్షన్ III అభ్యర్థులందరికీ తప్పనిసరి. కచ్చితమైన ప్రశ్నపత్రాన్ని ఇక్కడ చెక్ చేయవచ్చు: CUET Exam Pattern 2023
-
కింది తెలిపిన కాంబినేషనల్‌లో ఒక అభ్యర్థి గరిష్టంగా 9 పరీక్షలను రాయొచ్చు.
- 2 లాంగ్వేజ్‌లు+6 డొమైన్ నిర్దిష్ట సబ్జెక్టులు+1 జనరల్ టెస్ట్
- 3 లాంగ్వేజ్‌లు+5 డొమైన్ నిర్దిష్ట సబ్జెక్టులు+1 జనరల్ టెస్ట్
- పరీక్ష టైం: లాంగ్వేజ్‌లు, డొమైన్-నిర్దిష్ట సబ్జెక్టులు ఒక్కొక్కటి 45 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. జనరల్ టెస్ట్ 60 నిమిషాల పాటు జరుగుతుంది.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.comతో కూడా రాయవచ్చు.