CUET UG అడ్మిట్ కార్డ్ 2024 లింక్ (CUET UG Admit Card Link 2024) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CUET UG 2024 అడ్మిట్ కార్డ్ కోసం డౌన్‌లోడ్ లింక్‌ను ఈరోజు అంటే మే 13, 2024న యాక్టివేట్ చేసింది. దరఖాస్తుదారులు తమ లాగిన్ ద్వారా exams.nta.ac.in/CUET-UG లో తమ సంబంధిత హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు తమ దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
CUET అడ్మిట్ కార్డ్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది. PDF ఫార్మాట్‌లో ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌లో పేరు, జెండర్, కేటగిరి, పీడబ్ల్యుడీ స్థితి, తండ్రి పేరు, పుట్టిన తేదీ, నివాస రాష్ట్రం, అభ్యర్థి సంతకం, ఫోటోగ్రాఫ్, పరీక్ష వివరాలు, బార్‌కోడ్, డైరెక్టర్ సంతకం, స్లాట్ సమయాలు, వంటి పరీక్ష వివరాలు ఉంటాయి. వీటితో పాటు పరీక్ష తేదీ, గేట్ మూసివేసే సమయం, స్లాట్ నెంబర్, పరీక్షా కేంద్రం పేరు, అడ్ర్ కూడా ఉంటాయి.
CUET అడ్మిట్ కార్డ్ 2024 లింక్ (CUET Admit Card 2024 Link)
UG కోసం, CUET 2024 అడ్మిట్ కార్డ్‌కి నేరుగా లింక్‌ని ఇక్కడ కనుగొనండి:
CUET UG 2024 అడ్మిట్ కార్డ్ లింక్ (యాక్టివ్) |
---|
CUET 2024 హాల్ టికెట్‌కి సంబంధించిన సూచనలు
CUET హాల్ టికెట్ 2024కి సంబంధించిన కొన్ని కీలకమైన వివరాలు ఇక్కడ అందించబడ్డాయి:
హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రోజున పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి. CUET UG 2024 పరీక్ష మే 15 నుంచి 31, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది.
చివరి క్షణంలో సాంకేతిక లోపాలను నివారించడానికి అభ్యర్థులు వీలైనంత త్వరగా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
హాల్ టికెట్‌ను పరీక్షా వేదిక వద్దకు చిరిగిన/ముడతలు పెట్టిన/లేదా ముడుచుకున్న స్థితిలో తీసుకెళ్లకూడదు. ఇది సరైన స్థితిలో తీసుకువెళ్లాలి.
కార్డులో అన్ని వివరాలు తప్పనిసరిగా కనిపించాలి.
అడ్మిట్ కార్డ్‌కు ప్రత్యామ్నాయంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లకూడదు.
CUET అడ్మిట్ కార్డ్ 2024 పరీక్ష రోజు వరకు పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అవుట్‌లను తీసుకోవచ్చు.
హాల్ టికెట్ తప్పులు లేకుండా ఉండాలి. తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులను అధికారులు తిరస్కరిస్తారు.
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసిన తర్వాత, లోపాలు గుర్తించబడితే, అభ్యర్థులు వెంటనే అధికారులను 011-40759000 లేదా 01169227700 నెంబర్‌లో సంప్రదించాలి.
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ పోయినా లేదా పాడైపోయినా ఇబ్బంది పడకుండా దాని వేరే కాపీలను తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.