ఏపీలో దసరా సెలవులు 2024 (Dasara Holidays in AP 2024) : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో పిల్లలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పటికే ఏపీ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. ఈసారి దసరా సెలవులు పది రోజులపాటు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు పాఠశాలలకు అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పది రోజుల పాటు సెలవు ఉంటుంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి దసరా సెలవులు (Dasara Holidays in AP 2024) మొదలవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగుస్తాయి. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతాయి. కాగా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు వస్తుంది.
ఇది కూడా చదవండి :
విద్యార్థులకు అదిరిపోయే న్యూస్, 10 రోజులకుపైగా సెలవులు
అదే విధంగా ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనే దీపావళి పండుగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండడంతో ఆరోజున కూడా రాష్ట్రంలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ఉంటుంది. ఇదే సమయంలో క్రిష్టియన్ మైనారిటీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇస్తారు. ఈ తరగతుల నేపథ్యంలో అక్టోబర్ నెలలో కేవలం 17 రోజులు మాత్రమే తరగతులు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా దసరా సెలవులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అదనంగా సెలవులు ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణాలో 13 రోజుల పాటు బతుకమ్మ, దసరా సందర్భంగా పాఠశాలలు, కాలేజీల క్లోజ్ అవుతాయి. దసరా సెలవుల (Dasara Holidays in AP 2024) తర్వాత అక్టోబర్ 15న పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. విద్యా సంబంధిత వార్తలను ఇక్కడ తెలుసుకోండి.