దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ పండుగను (Deepavali Festival Essay in Telugu) భారతదేశంలో ఎంతో ఆనందంగా, గొప్పగా చేసుకుంటారు. ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. సాధారణంగా ఈ పండుగను కార్టీక మాసంలో అంటే అక్టోబర్ నెల మధ్య నుంచి నవంబర్ మధ్యలో ప్రజలు జరుపుకుంటారు. పిల్లలు ఈ పండుగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగను చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం గెలవడానికి సంకేతంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రజలు దీనిని చూస్తారు. పండుగ సందర్భంగా బంధువులు, స్నేహితులు కలసి ఆనందంగా జరుపుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. రాత్రి సమయంలో ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. టపాసులు, పటాకులు పేలుస్తుంటారు. హిందువులు ఈ పండుగ రోజు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు.
ఈ పండుగ వెనుక అనేక కథలు (Deepavali Festival Essay in telugu for class 3) కూడా మనుగడలో ఉన్నాయి. రాక్షస రాజు రావణుడిని ఓడించి, 14 సంవత్సరాల అజ్ఞాతవాసం గడిపిన తర్వాత రాముడు తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున దీపావళి పండుగను చేసుకున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయి. రాక్షసుడైన రావణుని రాజు రాముడు ఓడించిన సందర్భంగా ప్రజలు సంతోషిస్తూ నగరం మొత్తాన్ని మట్టి దీపాలతో, బాణసంచా పేల్చారు.
అదేవిధంగా ప్రజలని పీడించే రాక్షస రాజు నరకాసురుడైన శ్రీకృష్ణుడు, సత్యభామ ఓడించడంతో దీపావళి పండుగ ఉద్భవించిందనే కథ వినికిడిలో ఉంది. అంటే విపత్తు ముగిసి, ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేసి గెలిచిన వచ్చిన కృష్ణుడి విజయానికి సంకేతంగా ప్రతి ఇంట్లో ప్రజలు దీపాలు వెలిగించారు.
అలాగే సముద్ర మథనం సమయంలో కోజాగిరి పూర్ణిమ నాడు లక్ష్మీ దేవి పాల సముద్రం నుంచి పుట్టింది. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి, దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అదే దీపావళి అని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి పండుగ రోజున రాత్రి లక్ష్మీదేవి అందరి ఇళ్లకు వస్తుందని విశ్వసిస్తుంటారు. ఇళ్లను శుభ్రంగా, దీపాల వెలుగులో ఉంచితే వారిని ఆశీర్వదిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది.
దీపావళి పండుగకు మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదే బలి చక్రవర్తి, విష్ణువుల కథ. బలి చక్రవర్తి మంచి పాలకుడు. ఆయన రాజ్యంలోని ప్రజలు ఆయనని ఉదారమైన మంచి రాజుగా కీర్తిస్తుండేవారు. ఈ సమయంలో విష్ణువు మరుగుజ్జు బ్రాహ్మణుడి రూపంలో (అంటే వామన అవతారంలో) బలి చక్రవర్తి దగ్గరకెు వెళ్తాడు. భూమిని దానంగా కోరుతాడు. అడిగితే ఏదైనా ఇచ్చే పేరు గాంచిన బలి చక్రవర్తి దానికి అంగీకరిస్తాడు. విష్ణువు తన వామన అవతారంలో, మొత్తం భూమిని మూడు అడుగులతో ఆక్రమిస్తాడు. ఆ క్రమంలో బలి చక్రవర్తిని పాతాళలోకంలోకి తొక్కేస్తాడు. అయితే బలి చక్రవర్తి చేసిన పనికి, ఆయనలోని మంచి లక్షణాలకు విష్ణువు ఆనందించి అతనికి ప్రతి సంవత్సరం ఒక రోజు భూమికి తిరిగి రావడానికి వరం ఇస్తాడు. ఆ రోజును దీపావళి తర్వాత రోజు బలి ప్రతిపద లేదా పడ్వాగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల్లో ఉంది.
వీటితో పాటు 24వ చివరి తీర్థంకరుడైన మహా వీరుడు మోక్షాన్ని పొందినందుకు గుర్తుగా జైనులు దీపావళి పండుగను జరుపుకుంటారు. అలాగే సిక్కులు కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు. గురు హరగోవింద్ జీ 1619లో గ్వాలియర్ ఫోర్ట్ జైలు నుంచి విడుదలైన రోజుగా పరిగణించి దీపావళి పండుగను జరుపుకుంటారు.
దీపావళి పండుగకు బౌద్ధంలో ప్రత్యేకత ఉంది. మనుషుల్లో అజ్ఞానాన్ని వీడి వెలుగువైపు పయనించాలనే బుద్ధుడి బోధనలకు ప్రతీకగా దీపాలు వెలిగించే పద్ధతి, సంస్కృతి వచ్చిందనే వాదన కూడా ఉందది. జ్ఞానమే వెలుగుకు ప్రతిరూపంగా ఈ పండుగను చూస్తారు. బౌద్ధమతం కోణంలో దీపావళి పండుగకు విశిష్టమైన కథ వినికిడిలో ఉంది. సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన తర్వాత 18 సంవత్సరాలకు తాను పుట్టిన ఊరికి వెళ్తాుడు. ఆయన ఊరికి వస్తున్నాడనే సంతోషంతో ప్రజలంతా ఊరంతా దీపాలతో అలంకరించి స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఆరోజు అమావాస్య చిమ్మచీకటి కావడంతో ప్రతి ఇంటా దీపాలు వెలిగించారంట. తర్వాత అది సంప్రదాయంగా మారి వర్షవాసం ముగించుకుని గ్రామాలకు, నగరాీలకు వెళ్లే బౌద్ధ బిక్షవులకు ఇంటింటా దీపాలతో స్వాగతం పలికేవారంట. కొన్ని బౌద్ధ సమాజాలలో, ముఖ్యంగా నేపాల్‌లోని నెవార్ బౌద్ధులు, దీపావళి అమావాస్య నాడు అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారు.
రాష్ట్రాల్లో దీపావళి వేడకలు (Diwali Celebration States in India)
దీపావళి భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటారు. అియతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. తమదైనా ఆచారాలను, సంస్కృతులతో భిన్నంగా జరుపుకుంటారు.- గుజరాత్‌లో దీపావళి పండుగను ఐదురోజుల పాటు జరుపుకుంటారు. పండుగ సందర్భంగా లక్ష్మీ దేవతను పూజిస్తారు. దీపావళి వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడం అనేది గుజరాత్‌లోనే మొదలైంది.
- ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఈ ఆచారం అలవాటైంది. గుజరాత్ లో నరక చతుర్దశి రోజును 'ధన్ తెరాస్' అంటారు.
- కర్ణాటకలో ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. వీళ్లు కూడా ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. దీపావళి మూడో రోజును బాలి పాడ్యమిగా భావిస్తారు. ఆరోజున కుటుంబలోని మహిళలు ఇంటి ముందు చక్కని ముగ్గులుతో అలంకరిస్తారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు.
- తమిళనాడులో ప్రజలు దేవతలకు నైవేద్యం సమర్పించి, కుతు విలకు అనే దీపాన్ని వెలిగిస్తారు. ఇక్కడ నూతన వధూవరులు పెళ్లి తర్వాత వారి మొదటి దీపావళిని వధువు తల్లి ఇంట్లో జరుపుకుంటారు.
- మహారాష్ట్ర లో ప్రజలు ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుతారు. వీరు ఒక ఆవుకు దాని దూడకు హారతి ఇవ్వడంతో పండుగను మొదలుపెడతారు. అమావాస్య రోజున లక్ష్మిదేవికి పూజలు చేస్తారు. తమకు అధిక ఐశ్వర్యం, జ్ఞానం ఇవ్వమని కోరుకుంటారు.
- ఒడిశాలో ఈ పండుగను పెద్దల పండుగగా భావిస్తారు. తమ పూర్వీకులు ఈ అమావాస్య రోజున ఆకాశంలో వచ్చి విహరిస్తున్నారని భావిస్తారు. వారి ఆత్మ శాంతికి మోక్షం కలిగేందుకు, వెలుగులు చూపాలని బాణా సంచా కాలుస్తారు. లక్ష్మి దేవికి, కాళి మాతకు పూజలు నిర్వహిస్తారు.
- పశ్చిమ బెంగాల్లోని ప్రజలు ఈ పండుగ రోజును కాళికా మాతా దేవికి ప్రత్యేకంగా భావించి ఆ దేవి పూజలు జరుపుతారు. రాత్రి వేళ బాణ సంచా కాలుస్తారు. బీహార్ లోని మిధిలా ప్రాంతం, అసోంలోనూ కాళికా దేవి పూజతో పాటు లక్ష్మి, వినాకుడి విగ్రహాలకు కూడా పూజలు చేస్తారు. తమ కుటుంబాలను క్షేమంగా ఉంచమని, సకల సంపదలూ ప్రసాదించమని ఆ దేవతలను వేడుకుంటారు. బంధు మిత్రులతో కలసి ఇష్టమైన వంటకాలు తింటూ ఆనందిస్తారు.
- పంజాబ్‌లో కూడా సిక్కులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజున అమృతసర్ దీపాలతో వెలిగిపోతుంది. బాణాసంచాతో మారుమోగుతుంది.
చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ ఆనంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగను అందరూ ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటారు. నిజానికి దీపావళి పండుగక జాతీ, మతం, లింగ బేధాలు లేకుండా జరుపుకునే పండుగగా అభివర్ణించవచ్చు.