తెలంగాణ దసరా సెలవులు 2024 (Dussehra holidays in telangana 2024) :
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండుగల్లో దసరా పండుగ ఒకటి. ఇదే సమయంలో బతుకమ్మ పండుగ జరుగుతోంది. ఈ పండుగల దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు భారీగా సెలవులు (Dussehra holidays in telangana 2024) ఉంటాయి. ఈ వేడుకలతో రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు చాలా కాలం పాటు క్లోజ్ చేయబడతాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు అధికారికంగా సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి వరుసగా 13 రోజుల పాటు పాఠశాలలు క్లోజ్ చేయబడతాయి. దసరాల సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈ దిగువున అందిస్తున్నాం.
ఇది కూడా చదవండి:
ఏపీలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?
తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవుల 2024 (Dussehra Holidays 2024 Telangana schools)
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది. రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ రెండో తేదీన ప్రారంభమై అక్టోబర్ 14 వరకు పొడిగించబడతాయి. అంటే తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు దాదాపు రెండు వారాల పాటు క్లోజ్ చేయబడతాయి. సెలవుల్లో అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నాయి.ఈవెంట్ | తేదీలు |
---|---|
సెలవులు ప్రారంభ తేదీ | అక్టోబర్ 2, 2024 (గాంధీ జయంతి) |
సెలవు ముగింపు తేదీ | అక్టోబర్ 14, 2024 |
దసరా పండుగ తేదీ | అక్టోబర్ 12, 2024 |
పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యే తేదీ | అక్టోబర్ 15, 2024 |
దసరా సెలవు రోజుల్లో విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫ్యామిలీ టూర్లు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది తాము పుట్టిన ఊర్లకు వెళ్లి.. పండుగను వేడుకగా జరుపుకుంటుంటారు. ఈ సెలవులను వృథా చేసుకోకుండా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. కాగా రాష్ట్రంలో చాలా ప్రైవేట్ స్కూళ్లు సెలవులను ఒకరోజు ముందు నుంచే అంటే అక్టోబరు ఒకటో తేదీ నుంచే ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగతో పాటు బతుకమ్మ పండుగ కూడా ఉంది. బతుకమ్మను కూడా తెలంగాణ ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటారు.