TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (TS ECET 2023 Application Form Correction);
ఉస్మానియా విశ్వవిద్యాలయం మే 08, 2023న TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు విండోను యాక్టివేట్ చేయనుంది. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
ecet.tsche.ac.in
ని సందర్శించి, అప్లికేషన్‌లో తప్పులను సరిదిద్దుకోవచ్చు. కరెక్షన్ పేజీని (TS ECET 2023 Application Form Correction) యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు వివరాలను సవరించవచ్చు. మళ్లీ నమోదు చేయవచ్చు. అయితే కొన్ని వివరాలను అభ్యర్థులు సవరించుకోవచ్చు. కానీ మరికొన్ని వివరాలను అప్లికేషన్ ఫార్మ్‌కి సవరణ చేయడానికి అభ్యర్థులు
desktsecet@gmail.comలో అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 8 వరకు రూ. 500 ఆలస్య జరిమానాతో అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయవచ్చు.
TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన దిద్దుబాటు తేదీలు ((TS ECET 2023 Application Form Important Correction Dates))
ఈ దిగువ అభ్యర్థి అప్లికేషన్ ఫార్మ్ 2023ని పూరించడానికి, సబ్మిట్ చేయడానికి TS ECET అప్లికేషన్ ఫార్మ్ 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇక్కడ అందజేశాం.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రారంభ తేదీ | 8 మే 2023 |
దరఖాస్తును పూరించడానికి, సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | 10 మే 2023 |
రూ. 500 ఆలస్య జరిమానాతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | 8 మే 2023 |
రూ. 2500 ఆలస్య రుసుముతో దరఖాస్తును పూరించడానికి, సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | 12 మే 2023 |
TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు: ముఖ్యమైన సూచన (TS ECET 2023 Application Form Correction: Important Reference)
ఈ దిగువ అభ్యర్థి TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ముఖ్యమైన సూచనలను చెక్ చేయవచ్చు:
- అప్లికేషన్ ఫార్మ్‌కి దిద్దుబాట్లు చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా కేటాయించిన వ్యవధిలోపు ప్రక్రియను పూర్తి చేయాలి
- గడువు ముగిసిన తర్వాత దిద్దుబాటు చేయడానికి ఏ అభ్యర్థికి అవకాశం ఉండదు.
- TS ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ లింక్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో యాక్టివేట్ అవుతుంది.
- అభ్యర్థి పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, ఫోటోగ్రాఫ్, సంతకం, కేటగిరి, ఎంచుకున్న పరీక్ష, అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ వంటి కొన్ని వివరాలను సవరించడం అవ్వదు.
- పైన పేర్కొన్న వివరాల్లో మార్పులు చేయడానికి అభ్యర్థి చెల్లుబాటు అయ్యే కారణం, రుజువులను ఈ మెయిల్ desktsecet@gmail.com ఐడీ ద్వారా అధికారులను సంప్రదించాలి.
- ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, ఇతరుల పేరు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వంటి వివరాలను TS ECET 2023 దరఖాస్తు ప్రక్రియలో సవరించవచ్చు.