తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పలు ఉద్యోగాల (GGH Nagar Kurnool Jobs) భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
GGH Nagar Kurnool Jobs: ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీ, నెలకు లక్ష రూపాయలు జీతం, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ తెలుసుకోండి
నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలు (GGH Nagar Kurnool Jobs):
తెలంగాణలోని నాగర్ కర్నూలులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పలు ఉద్యోగాల (GGH Nagar Kurnool Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 06 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హతల గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 29, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు (GGH Nagar Kurnool Jobs) అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది. ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్‌ని చూడొచ్చు.
నాగర్ కర్నూల్ జీజీహెచ్‌లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ దిగువున జీతం వివరాలను అందించడం జరిగింది.
ఉద్యోగం
జీతం
పాథాలజిస్ట్
రూ.1,00,000
మైక్రో బయాలజిస్ట్
రూ.1,00,000
బయోకెమిస్ట్
రూ.1,00,000
రేడియాలజిస్ట్
రూ.1,00,000
ల్యాబ్ మేనేజర్
రూ.30,000
రేడియోగ్రాఫర్
రూ.30,000
GGH నాగర్ కర్నూల్ రివ్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for GGH Nagar Kurnool Jobs)
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో నింపిన దరఖాస్తులను, ధ్రువపత్రాలను జత చేసి సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నాగర్ కర్నూలు అడ్రస్‌కు పంపించాలి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 29, 2023 చివరి తేదీ.