శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS కటాఫ్ 2024 (Government Medical College Srikakulam NEET MBBS Expected CUTOFF 2024): శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చాలామంది చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ తరుణంలో ఈ ఏడాది శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీ NEET MBBS కటాఫ్ 2024 తెలుసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల కోసం ఈ ప్రభుత్వ కాలేజీకి సంబంధించిన NEET MBBS ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2024ని అంచనాగా ఇక్కడ అందించాం. అయితే ఇది పూర్తిగా వాస్తవమైన కటాఫ్ కాదని అభ్యర్థులు గుర్తించాలి. కేవలం అంచనాగా అందిస్తున్నాం. ఇది వాస్తవ కటాఫ్‌కి కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నీట్ ఎంబీబీఎస్ అంచనా కటాఫ్ 2024 (Government Medical College Srikakulam NEET MBBS Expected CUTOFF 2024)
NEET 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈ కళాశాలలో చేరేందుకు ఈ ఏడాది ఎంత కటాఫ్ సాధించాల్సి ఉంటుందో ఇక్కడ అంచనాగా అందిస్తున్నాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ దిగువున కటాఫ్ వివరాలను అందించడం జరిగింది.కేటగిరి | శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ NEET MBBS అంచనా కటాఫ్ 2024 |
---|---|
OC | 600 నుంచి 585 |
BC | 600 నుంచి 510 |
SC | 612 నుంచి 500 |
ST | 500 నుంచి 455 |
ఈ ఏడాది నీట్ ఎంబీబీఎస్ 2024 వివాదాస్పదంగా మారింది. మే 5న జరిగిన నీట్ మెడిక్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు భారీగా వచ్చాయి. ఈ తరుణంలో కొన్ని చోట్ల పేపర్లు లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన వ్యక్తిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ కూడా చేశారు.
ఇవి కూడా చదవండి...