గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు (Guntur District SC and ST Backlog Recruitment 2023):
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లైచేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉండాల్సిన అర్మతలేంటో? ఎప్పటిలోగా ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టుల నోటిఫికేషన్ డైరక్ట్ లింక్ |
---|
గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు (Guntur District SC and ST Backlog Recruitment Post Deatils)
గుంటూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు ఈ దిగువున టేబుల్లో చూడవచ్చు.పోస్ట్ పేరు | పోస్టుల సంఖ్య |
---|---|
జూనియర్ అసిస్టెంట్ | 2 |
జూనియర్ స్టెనో | 1 |
టైపిస్ట్ | 3 |
మాట్రాన్ కమ్ స్టోర్ కీపర్ | 1 |
ఆఫీస్ సబార్డినేట్ | 8 |
మెసెంజర్ | 2 |
ల్యాబ్ అసిస్టెంట్ | 1 |
ల్యాబ్ అటెండర్ | 1 |
వర్క్‌షాప్ అటెండర్ | 1 |
స్కిల్డ్ వర్క్ మ్యాన్ | 1 |
ఫిసర్ మ్యాన్ | 1 |
శానిటరీ మేస్త్రీ | 1 |
వాచ్ మ్యాన్ | 9 |
వాటర్ మ్యాన్ | 1 |
స్వీపర్ | 3 |
పబ్లిక్ హెల్త్ వర్కర్ | 12 |
గ్యాంగ్ మజ్దూర్ | 2 |
డ్రెయిన్ క్లీనర్ | 1 |
కళాసి | 1 |
హోల్ టైమ్ సర్వేంట్ | 1 |
లస్కర్ | 1 |
గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్ ల్యాగ్ పోస్టులకు అర్హతలు (Qualifications for Guntur District SC and ST Back Lag Posts)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.- అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్ భాషలో చదవడం, రాయడం
- 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ పాసై ఉండాలి.
- టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
- జూలై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండాలి.
గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలంటే? (How to apply for Guntur District SC, ST Backlog Posts?)
గుంటూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోాగాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11, 2023వ తేదీలోపు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.in లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. తమ పూర్తి వివరాలతో దరఖాస్తును నింపి, అవసరమైన అర్హత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 11, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.32,000 వరకు జీతం ఉంటుంది.తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.