RRB JE ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ 2024 (RRB JE apply online 2024) :
రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS)7000లకు పైగా పోస్టులను భర్తీ చేయబుతోంది. దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, ఇతర పోస్ట్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రైల్వే JE పరీక్షను నిర్వహిస్తుంది. అయితే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది? చివరి తేదీ ఎప్పుడు? అసలు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలను ఇక్కడ అందించాం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 7934 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ RRB JE 2024 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా డిప్లొమాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
ఇది కూడా చదవండి:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైల్వే శాఖలో 7934 పోస్టులు
RRB JE రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 (RRB JE Recruitment 2024 Apply Online Last Date)
రైల్వే జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ని ఇక్కడ చూడండి.ఈవెంట్స్ | తేదీలు |
---|---|
RRB JE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ | 22 జూలై 2024 |
రైల్వే JE 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీ | 30 జూలై 2024 |
ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/UPI) పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ | 29 ఆగస్టు 2024 |
SBI బ్యాంక్ చలాన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించేందుకు చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
పోస్ట్ ఆఫీస్ చలాన్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించేందుకు చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
RRB JE పోస్టుల దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
RRB JE CBT పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది |
RRB JE 2024 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online for RRB JE 2024?)
RRB JE 2024 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విధానాన్ని ఈ దిగువున అందించాం.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఉదాహరణకు చండీగఢ్ కోసం www.rrbcdg.gov.in, బెంగళూరు కోసం www.rrbbnc.gov.in.
- స్టెప్ 2: RRB జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024 ఓపెన్ చేయాలి.
- స్టెప్ 3: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: మీ దరఖాస్తును ప్రారంభించడానికి 'కొత్త రిజిస్ట్రేషన్' బటన్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ID, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడానికి అవసరమైన పేరు, ఈ మెయిల్ ID, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలను పూరించాలి.
- స్టెప్ 5: ముఖ్యంగా దరఖాస్తులోని మూడు విభాగాలను పూరించాలి. వ్యక్తిగత వివరాలు, అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ & సంతకం & విద్యా అర్హతలు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న స్పెసిఫికేషన్‌ల ప్రకారం మీ ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- స్టెప్ 6: రైల్వే JE 2024 పరీక్ష కోసం మీ దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
- స్టెప్ 7: మీ దరఖాస్తును విజయవంతంగా దరఖాస్తును సమర్పించడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 8: భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ప్రింట్ తీసుకోవాలి.