Jagananna Vidya Deevena 2023 Payment Status: జగనన్న విద్యా దీవెన నిధులు మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా తెలుసుకోండి
జగనన్న విద్యా దీవెన పథకం 2023 నిధులు (Jagananna Vidya Deevena 2023 Payment Status):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి పిల్లలకి చదువుల్లో చేయూత నివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ మొదలైన కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడం జరుగుతుంది. అర్హతలున్న పేద విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఏడాదికి 20 వేల రూపాయలు పొందుతారు. ఏడాదిలో నాలుగు విడతల్లో విద్యార్థులకు పూర్తి ఫీజును అధికారులు విడుదల చేస్తారు. ఈ ఏడాది మొదటి విడత జగనన్న విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Vidya Deevena 2023) మార్చి 7న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడినట్టు తెలుస్తుంది.
జగనన్న విద్యాదీవెన పథకం 2023 వివరాలు (Jagananna Vidya Deevena 2023)
ఏపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల చదవుల కోసం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థుల ఉన్నతి కోసం ఏడాదికి నాలుగు విడతల్లో డబ్బులు విద్యార్థుల అకౌంట్లలో జమ చేస్తుంది.పథకం | జగనన్న విద్యా దీవెన పథకం |
---|---|
ఉద్దేశం | విద్యార్థులకు ఆర్థిక సాయం |
అధికారిక వెబ్‌సైట్ | https://navasakam.apcfss.in, https://jnanabhumi.ap.gov.in |
జగనన్న విద్యా దీవెన 2023 పేమంట్ స్టేటస్‌ని చెక్ చేసుకునే విధానం
జగనన్న విద్యా దీవెన 2023 నిధులు (Jagananna Vidya Deevena 2023 Payment Status) అకౌంట్‌లో జమ అయ్యాయో? లేదో? అని రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు. https://navasakam.apcfss.in, https://jnanabhumi.apcfss.in రెండు వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిధులు జమ అయ్యాయో? లేదో? చెక్ చేసుకోవచ్చు.- స్టెప్ 1 : మొదటగా https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించాలి
- స్టెప్ 2: వెబ్‌సైట్‌లోని హోంపేజీలో కనపడే LOGIN అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి
- స్టెప్ 3: User IDలో విద్యార్థి 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి
- స్టెప్ 4: విద్యార్థి పాస్‌వర్డ్ తెలిస్తే ఎంటర్ చెయ్యాలి. ఒక వేళ మొదటిసారి లాగిన్ అయినా, పాస్‌వర్డ్ మరిచిపోయినా "Forgot Password"పై క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి.
- స్టెప్ 5: విద్యార్థి లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 6: Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకుని Get Application Statusపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 7: ఇప్పుడు మీ డేటా ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.
- స్టెప్ 8: అక్కడ చూపిస్తున్న Payment Statusలో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్‌గా చూపిస్తుంది.
- స్టెప్ 9: ఒకవేళ Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది. అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Successగా మారుతుంది.
- https://navasakam.apcfss.in/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన వెంటనే JVD Alert Report అని కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో JVD MTF, JVD RTF అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
- క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో Check JVD Status అనే దానిపై క్లిక్ చేయాలి.
- తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Application ID/ Adhar Number అని అడుగుతుంది.
- అక్కడ విద్యార్థి ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసి Get Application Status పై క్లిక్ చేయాలి.
- దాంతో విద్యార్థి పూర్తి వివరాలు ఓపెన్ అవుతాయి. కిందకు స్క్రోల్ చేయాలి. దిగువున పేమంట్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అమౌంట్ క్రెడిట్ అయిందా? లేదా? అనేది క్లియర్‌గా ఉంటుంది.