ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 (IBPS Clerk Result 2023 Prelims):
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ ibps.inలో IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023ని (IBPS Clerk Result 2023 Prelims) విడుదల చేసింది. IBPS క్లర్క్ 2023 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు 7 అక్టోబర్ 2023న షెడ్యూల్ చేయబడిన మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులవుతారు. IBPS క్లర్క్ ఫలితం 2023 రాష్ట్రాల వారీగా పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఈ ఆర్టికల్లో IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్‌ను అందించడం జరిగింది.
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి |
---|
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 ఓవర్ వ్యూ (IBPS Clerk Prelims Results 2023 Overview)
ప్రతి అభ్యర్థి ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రతి పరీక్షలో కనీస స్కోర్‌ను పొందవలసి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి పరిగణించబడే కనీస మొత్తం స్కోర్‌ను కూడా పొందాలి. అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి, కటాఫ్‌లు నిర్ణయించబడతాయి. అభ్యర్థులు ఫైనల్ ఎంపిక కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. IBPS క్లర్క్ ఫలితాలు 2023 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.
సంస్థ పేరు | ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ |
---|---|
పరీక్ష పేరు | IBPS క్లర్క్ |
పోస్టుల ఖాళీల సంఖ్య | 4545 |
IBPS క్లర్క్ ఫలితాలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2023 | ఆగస్ట్ 26, 27, సెప్టెంబర్ 02, 2023 |
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023 | సెప్టెంబర్ 14, 2023 |
IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ 2023 | అక్టోబర్ 07, 2023 |
అధికారిక వెబ్‌సైట్ | www.ibps.in |
IBPS క్లర్క్ ఫలితాలు 2023 ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to Check IBPS Clerk Result 2023?)
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను www.ibps.inని సందర్శించాలి. లేదా పైన అందించిన IBPS క్లర్క్ ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
- హోంపేజీలో ఎడమవైపు ఉండే CRPs-క్లరికల్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో "కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫర్ క్లరికల్ కేడర్ XIII"పై క్లిక్ చేయాలి.
- మళ్లీ ఇంకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ IBPS క్లర్క్ ఫలితాలు 2023 అని ఉండే లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ , క్యాప్చా ఎంటర్ చేయాలి.
- దాంతో స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. అభ్యర్థులు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.