IDBI రిక్రూట్‌మెంట్ 204 చివరి తేదీ (IDBI Recruitment 2024 Last Date) : IDBI బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల కోసం దరఖాస్తులను కోరడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం డిగ్రీ అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. IDBI రిక్రూట్‌మెంట్ 2024 పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ (IDBI Recruitment 2024 Last Date) నవంబర్ 16, 2024.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష డిసెంబర్ 1, 2024న ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీ వారీగా IDBI రిక్రూట్‌మెంట్ 2024 ఖాళీల వివరాలు (Category wise IDBI Recruitment 2024 Vacancy Details)
కేటగిరీ వారీగా IDBI రిక్రూట్‌మెంట్ 2024 పోస్టుల వివరాలు ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.కేటగిరి | పోస్టుల సంఖ్య |
---|---|
UR | 448 పోస్ట్‌లు |
ST | 94 పోస్టులు |
SC | 127 పోస్టులు |
OBC | 231 పోస్టులు |
EWS | 100 పోస్ట్‌లు |
PwBD | 40 పోస్ట్‌లు |
IDBI రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (IDBI Recruitment 2024 Eligibility Criteria)
IDBI రిక్రూట్‌మెంట్ 2024 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాల వివరాలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ప్రభుత్వంతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొంది ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా అక్టోబర్ 2,1999 కంటే ముందు, అక్టోబర్ 1, 2004 (రెండు తేదీలు కలుపుకుని) కంటే ముందుగా పుట్టి ఉండాలి.
IDBI రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ (IDBI Recruitment 2024 Selection Process)
IDBI ఉద్యోగాల కోసం వివిధ దశల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.- ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటాయి.
- ఆన్‌లైన్ పరీక్షలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్/ఐటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
- ప్రతి ప్రశ్నకు అభ్యర్థి తప్పు సమాధానం ఇస్తే, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు లేదా 0.25 కోత విధించబడుతుంది.