ఇండియా పోస్టల్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (India Post GDS Apply Online 2024) :
ఇండియా పోస్ట్, గ్రామీణ డాక్ సేవక్ (GDS) స్థానానికి 44,228 ఖాళీల నియామకాలను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in ద్వారా ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో (India Post GDS Apply Online 2024) జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 5, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన వారు FY25 కోసం బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్‌గా నియమితులవుతారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానం ఈ దిగువున వివరంగా అందించాం. ఆ స్టెప్స్‌ని ఫాలో అయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫీజు, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం వంటి మూడు దశల్లో ఉంటుంది.
ఇది కూడా చదవండి:
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త, 10వ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీసు ఉద్యోగాలు
ఇది కూడా చదవండి:
పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందాలంటే కటాఫ్ ఎంతో తెలుసా?
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజిస్ట్రేషన్ 2024 లింక్ (India Post GDS Registration 2024 Link)
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిజిస్ట్రేషన్ 2024 లింక్: ఇక్కడ క్లిక్ చేయండి |
---|
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలు (India Post GDS Recruitment 2024 Eligibility)
తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 44,228 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలుండాలి.- పదో తరగతి పాసై ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు తమ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్‌ను మ్యాథ్స్, ఇంగ్లీషులో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల బోర్డు నుంచి పాస్ మార్కులను పొంది ఉండాలి.
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 202 దరఖాస్తు చేసుకునే విధానం (India Post GDS Recruitment 202 Steps to Apply)
ఈ పోస్టులకు అభ్యర్థులు చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ దిగువున ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.- ముందుగా అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను indiapostgdsonline.in సందర్శించాలి. మీరు పైన అందించిన డైరెక్ట్ లింక్‌పై కూడా క్లిక్ చేయవచ్చు.
- హోంపేజీకి కుడివైపున అందించిన రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ఇండియా పోస్ట్ GDS రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను పూరించడానికి మీ ప్రాథమిక వివరాలు, చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాలి.
- ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ రూపొందించబడుతుంది.
- హోంపేజీకి మళ్లీ సందర్శించి, 'ఆన్‌లైన్‌లో వర్తించు' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నమోదు చేయాలి. మీకు ఇష్టమైన పోస్టల్ సర్కిల్‌ను ఎంచుకోవాలి.
- దరఖాస్తులో అవసరమైన వివరాలను పూరించడం ప్రారంభించాలి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి, వర్తించే ఫీజులను చెల్లించాలి.
- భవిష్యత్ సూచన కోసం పోస్ట్ ఆఫీస్ GDS రిజిస్ట్రేషన్ ఫార్మ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి ABPM/GDS కోసం నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు, BPM పోస్టులకు రూ. 12,000 నుంచి రూ.29,380ల వరకు జీతాలు అందించడం జరుగుతుంది.