జేఈఈ మెయిన్ 2023 ఫలితాలు (JEE Main 2023 Results) Direct Link Activated - |
---|
JEE మెయిన్ 2023 సెషన్ 1 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check JEE Main 2023 Session 1 Results)
జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023 Results Released) సెషన్ 1 కి సంబంధించిన పలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2023 ఆన్సర్ కీని సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో..? ఈ దిగువున తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఈ కింద తెలిపిన విధంగా జేఈఈ మెయిన్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.- అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in కు వెళ్లాలి
- హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ సెషన్ 1 2023 అనే లింక్‌పై (Link 1 – Results for JEE MAIN (2023): Paper 1 – B.E. / B.Tech ) క్లిక్ చేయాలి.
- తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- వివరాలు ఎంటర్ చేసిన తర్వాత స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తోంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main 2023) తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. NTA తెలిపిన లెక్కల ప్రకారం పేపర్ 1 కోసం మొత్తం 8.22 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. NTA పరీక్షలను నిర్వహించడం ప్రారంభించినప్పటి నుంచి JEE మెయిన్ పేపర్ 1కి ఇదే అత్యధిక హాజరు అని NTA పేర్కొంది. JEE మెయిన్ పరీక్ష 2023 (JEE Main 2023) ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 13 భాషలలో నిర్వహించడం జరిగింది.