JEE Main January 2023 (Day 2): ఏ సబ్జెక్ట్ కఠినంగా మరియు సులభంగా ఉందో తెలుసుకోండి

Andaluri Veni

Updated On: January 25, 2023 01:15 PM

జేఈఈ మెయిన్ 2023 సెషన్ 2  (JEE Main 25 January Question Paper Analysis) పరీక్షా పేపర్ మరీ కష్టంగా లేదు. అందుకని సులభంగాను ఇవ్వలేదని తెలుస్తుంది. పరీక్షా పేపర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ  ఆర్టికల్లో విశ్లేషించాం. 
JEE Main January 2023 (Day 2): ఏ సబ్జెక్ట్ కఠినంగా మరియు సులభంగా ఉందో తెలుసుకోండి

JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష (JEE Main 25 January Question Paper Analysis): JEE మెయిన్ 2023 రెండో రోజు 25 జనవరి 2023 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్‌‌ గురించి పూర్తి సమాచారం (JEE Main 25 January Question Paper Analysis) ఈ ఆర్టికల్లో అందజేశాం. జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) ప్రశ్నాపత్రంపై విద్యార్థుల స్పందన ఆధారంగా ఈ ఎనాలిసిస్ అందించడం జరిగింది. JEE మెయిన్ సెషన్ 1లో జనవరి 25న క్వశ్చన్ పేపర్ మరీ కష్టంగా లేదు, మరీ సులభంగాను లేదు. మధ్యస్థంగా ఉన్నట్టు తెలుస్తుంది.  JEE మెయిన్ 25 జనవరి 2023 షిఫ్ట్ (JEE Main 25 January Question Paper Analysis) 1 ఆన్‌లైన్ సీబీటీ ఎగ్జామ్ ఉదయం  9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరిగింది. ప్రశ్న పత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం 90 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో సబ్జెక్ట్‌ నుంచి 30 ప్రశ్నలు ఇచ్చారు. క్వశ్చన్ పేపర్‌లో MCQ, NAT ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 20 MCQలు, 10 NAT ప్రశ్నలు ఉన్నాయి.  అధికారిక JEE మెయిన్ 2023 జవాబు కీ తేదీ సెషన్ 1 పరీక్ష ముగిసిన మూడు రోజుల్లోపు విడుదల చేసే అవకాశం ఉంది.

JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష పేపర్‌పై ముఖ్యమైన అంశాలు (Major Highlights of JEE Main Session 1 Exam Paper)

విద్యార్థులు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా జేఈఈ మెయిన్  2023 (JEE Maun 2023)  సెషన్ 1 జనవరి 25 పరీక్ష పేపర్‌కు సంబంధించిన పూర్తి ఎనాలిసిస్  వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్‌గా జేఈఈ మెయిన్ సెషన్ 1  డిసెంబర్ 2023 పరీక్షా పేపర్ మధ్యస్థంగా ఉంది. పేపర్ మరీ కష్టంగానూ ఇవ్వలేదని, అందుకని సులభంగా కూడా లేదని విద్యార్థులు చెబుతున్నారు.

  • షిఫ్ట్ 1 పరీక్ష మొత్తం క్లిష్టత స్థాయి మధ్యస్థంగా ఉంది. చాలా మంది విద్యార్థులు ఇతర విభాగాలతో పోలిస్తే కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని అభిప్రాయపడ్డారు.
  • కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇనార్గానిక్, భౌతిక రసాయన శాస్త్రం కంటే ఎక్కువ ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుండి అడిగారు.
  • ఫిజిక్స్ ప్రశ్నలపై విద్యార్థులు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఫిజిక్స్ ప్రశ్నాపత్రం  కష్టంగా ఉందని భావిస్తే మరికొందరు బాగానే ఉందంటున్నారు.
  • మ్యాథ్స్‌‌లో కొంచెం కష్టమైన ప్రశ్నలు ఇచ్చినట్టు విద్యార్థులు అంటున్నారు.
  • రెండు షిఫ్ట్‌లలో మ్యాథ్స్‌లో గణాంకాల నుంచి ఎటువంటి ప్రశ్న ఇవ్వలేదు.
  • గత సంవత్సరాల పేపర్‌తో పోలిస్తే కాలిక్యులస్ చాలా సులభంగా ఇవ్వడం జరిగింది.

JEE మెయిన్ 25 జనవరి 2023 షిఫ్ట్ 1 పరీక్ష విశ్లేషణ (JEE Main 25 January 2023 Shift 1 Exam Analysis)

జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) షిఫ్ట్ 1కు సంబంధించిన  పరీక్ష విశ్లేషణ  ఈ దిగువున ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పూర్తి విశ్లేషణను అప్‌డేట్ చేస్తాం.

సెక్షన్ విశ్లేషణ
మొత్తంగా క్లిష్టత స్థాయి Moderate
ఫిజిక్స్ పేపర్ క్లిష్టత స్థాయి Easy to Moderate
కెమిస్ట్రీ పేపర్ క్లిష్టత స్థాయి Moderate
గణితం పేపర్ క్లిష్టత స్థాయి Moderate to Difficult
NAT ప్రశ్నల క్లిష్టత స్థాయి తెలియాల్సి ఉంది


JEE Main 2023 గణితంలో ఎక్కువ  వెయిటేజీ ఉన్న టాపిక్స్ (Topics with more weightage in Mathematics of JEE Main 2023)

జేఈఈ మెయిన్ 2023 మ్యాథ్స్‌లో (Topics with more weightage in Mathematics of JEE Main 2023) ఎక్కువ  వెయిటేజీ ఉన్న టాపిక్స్ గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది.

మ్యాట్రిక్స్ (Matrix
ఇంటి‌గ్రేషన్ (Integration)
హైపర్బోలా (Hyperbola)
సెట్ (Set)
ఫంక్షన్ (Function)
3డి జామెట్రీ (3D Geometry)
కాలిక్యులస్ (Calculus)

జేఈఈ మెయిన్ 2023 ఫిజిక్స్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్  (More weightage topics in JEE Main 2023 Physics)


జేఈఈ మెయిన్ 2023 ఫిజిక్స్‌లో (More weightage topics in JEE Main 2023 Physics) ఎక్కువ  వెయిటేజీ ఉన్న టాపిక్స్ గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది.

మెకానిక్స్ (Mechanics)
మోడరన్ ఫిజిక్స్  (Modern Physics)
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ (Electromagnetic force)
సెమీకండక్టర్స్ (Semiconductors)
కైనమాటిక్స్ (Kinematics)
ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్స్ (Electromagnetic Systems)
మోడ్రన్ ఫిజిక్స్ (Modern Physics)
కమ్యూనికేషన్ సిస్టమ్స్ (Communication Systems)

జేఈఈ మెయిన్ 2023  కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ (Topics with more weightage in Chemistry)

జేఈఈ మెయిన్ 2023 కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ గురించి ఈ దిగువన ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.

బయోమోలిక్యూల్స్ (Biomolecules)
ఆర్గానిక్ కెమిస్ట్రీ (Organic Chemistry)
ఇనార్గానిక్ కెమిస్ట్రీ  (Inorganic Chemistry)
ఫిజికల్ కెమిస్ట్రీ  (Physical Chemistry)
బ్లాక్ కెమిస్ట్రీ  (Block Chemistry)
దైనందిన జీవితంలో కెమిస్ట్రీ  (Chemistry in everyday life)

జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoను చూడవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-25th-january-2023-shift-1-question-paper-analysis-35841/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Tell us your JEE Main score & access the list of colleges you may qualify for!

కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి
Top