జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 డైరక్ట్ లింక్ (JEE Main 2023 Admit Card Direct Link)
JEE మెయిన్ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ దిగువన లింక్ ఇచ్చాం. అభ్యర్థులు దానిపై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 (JEE MAIN Admit Card 2023)- Direct Link Activated |
---|
జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ? (How to Download JEE Main 2023 Admit Card)
జేఈఈ మెయిన్ 2023 ఎగ్జామ్ (JEE Main 2023)కు అప్లై చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఈ లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ (JEE Main 2023) మెయిన్ 2023 ప్రవేశ పరీక్షకు అడ్మిట్ కార్డు లేకుండా అభ్యర్థులను అనుమతించరు.JEE మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్‌ను అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ దిగువున తెలియజేశాం.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Jeemain.nta.nic.in వెళ్లాలి.
హోంపేజీలో 'JEE Main Admit Card 2023' సెషన్ 1 లింక్‌పై క్లిక్ చేయాలి
తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాత ఓపెన్ అయ్యే దరఖాస్తులో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.
ఆ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత JEE మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది
అభ్యర్థులు భవిష్యత్ ప్రయోజనం కోసం అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అభ్యర్థులు JEE Main Admit Card 2023లో వివరాలను చెక్ చేసుకోవాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరి, స్టేట్ ఎలిజిబిల్టీ, జేఈఈ మెయిన్ 2023 రోల్ నెంబర్, ఫోటో, అభ్యర్థి సంతకం సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.