SC కేటగిరికి JEE మెయిన్ 2023 అంచనా కటాఫ్ (JEE Main Cutoff 2023 for SC Category):
గత ట్రెండ్‌ల ఆధారంగా SC కేటగిరీకి JEE మెయిన్ కటాఫ్ (JEE Main Cutoff 2023 for SC Category) ప్రతి సంవత్సరం 3 నుంచి 4 శాతం తగ్గుతోంది. అయితే ఈ ఏడాది కటాఫ్‌లో తగ్గుదల అంచనా వేయగా గత సంవత్సరాల్లో కంటే ఇది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కటాఫ్‌ను ప్రభావితం చేసే ప్రధాన కారకాల్లో ఒకటి రిజిస్ట్రేషన్‌ల సంఖ్య, ఈ విద్యా సంవత్సరంలో సెషన్ 2 కోసం దాదాపు 3 లక్షల రిజిస్ట్రేషన్‌లు 2022 సెషన్‌తో పోలిస్తే పెరిగాయి.
సెషన్ 1 కోసం రిజిస్ట్రేషన్‌లు రెండు సంవత్సరాల పాటు ఒకే పరిధిలో ఉన్నప్పటికీ ఈ వ్యత్యాసం ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ల సంఖ్యను పెంచుతుందని, తద్వారా కటాఫ్‌లు కఠినంగా మారుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు గరిష్ట కటాఫ్ పర్సంటైల్ కూడా పెరిగే అవకాశం ఉంది. గరిష్ట కటాఫ్ పర్సంటైల్ కారణంగా దీనిపై రిజర్వ్ చేయబడిన విద్యార్థి జనరల్ కేటగిరీ కింద అడ్మిషన్ పొందుతాడు. అతని/ఆమె రిజర్వేషన్ రద్దు చేయబడుతుంది.
SC కేటగిరీకి JEE మెయిన్ ఊహించిన కటాఫ్ 2023 (JEE Main Expected Cutoff 2023 for SC Category)
SC కేటగిరీ అభ్యర్థులకు, కనిష్ట, గరిష్ట కటాఫ్‌లు అంచనా వేయబడిన పర్సంటైల్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.
JEE మెయిన్ SC అంచనా కటాఫ్ 2023 | |
---|---|
కనిష్ట కటాఫ్ పర్సంటైల్ | 41 నుంచి 43 పర్సంటైల్ |
గరిష్ట కటాఫ్ పర్సంటైల్ | 87 నుంచి 90 పర్సంటైల్ |
ఈ JEE మెయిన్ కటాఫ్ NIT, IIIT, GFTI కౌన్సెలింగ్‌కు అర్హత కోసం మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి. JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందాలంటే మీ ర్యాంక్ తప్పనిసరిగా 2,50,000 అభ్యర్థులలోపు ఉండాలి. ఇది కూడా కేటగిరీల వారీగా విభజించబడింది. JEE మెయిన్ ఫలితం తర్వాత పంపిణీ తెలియజేయబడుతుంది. ఈ కటాఫ్‌కు అర్హత సాధించనంత మాత్రానా JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎలిజిబిలిటీకి గ్యారంటీ ఉండదు.
JEE మెయిన్ SC కటాఫ్ 2023: మునుపటి ట్రెండ్‌లు (JEE Main SC Cutoff 2023: Previous Trends)
2022 నుంచి 2019 వరకు JEE మెయిన్ కటాఫ్ పర్సంటైల్ ట్రెండ్‌లను ఈ దిగువున ఉన్న టేబుల్ ద్వారా చెక్ చేయవచ్చు. 2019కి ముందు ఫలితాలు, కటాఫ్ పర్సంటైల్‌లకు బదులుగా రా మార్కులు ఆధారంగా ఇవ్వడం జరిగింది.
సంవత్సరం | కనిష్ట కటాఫ్ పర్సంటైల్ | గరిష్ట కటాఫ్ పర్సంటైల్ |
---|---|---|
2022 | 43.0820954 | 88.4037478 |
2021 | 46.8825338 | 87.8950071 |
2020 | 50.1760245 | 90.3765335 |
2019 | 54.0128155 | 89.7548849 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
ఈ లింక్‌పై క్లిక్ చేయండి.