కేవీఎస్ అడ్మిషన్ 2024-25 (KVS Admission 2024-25) :
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2024-25 (KVS Admission 2024-25) విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. ఒకటో తరగతి రిజిస్ట్రేషన్లతో పాటు, రెండు, ఆపై తరగతుల వారికి ఆప్‌లైన్ అడ్మిషన్లు ఏప్రిల్ 1, 2024న KVS అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. కేంద్రీయ విద్యాలయ ఒకటో తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.inలో నేరుగా లింక్‌ని చెక్ చేయవచ్చు. డైరక్ట్ లింక్ కోసం
kvsonlineadmission.kvs.gov.in
లో కూడా చెక్ చేయవచ్చు. ఇప్పటికే లింక్ యాక్టివేట్ అయింది. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన, వెయిట్‌లిస్ట్ చేయబడిన రిజిస్టర్డ్ అభ్యర్థుల మొదటి తాత్కాలిక జాబితా ఏప్రిల్ 19, 2024న ప్రదర్శించబడుతుంది. రెండో తాత్కాలిక జాబితా ఏప్రిల్ 29, 2024న అందుబాటులో ఉంటుంది. మూడో జాబితా మే 8, 2024న అందుబాటులో ఉంటుంది.
KVS అడ్మిషన్లు 2024-25 డైరక్ట్ లింక్ (KVS Admissions 2024-25 Direct Link)
KVS అడ్మిషన్లు 2024-25 డైరక్ట్ లింక్ |
---|
KVS అడ్మిషన్ 2024-25 అర్హత ప్రమాణాలు (KVS Admission 2024-25 Eligibility Criteria)
ఒకటో తరగతికి అడ్మిషన్ కోరుకునే విద్యార్థుల వయస్సు మార్చి 31 నాటికి 6 సంవత్సరాల వయస్సు ఉండాలి (ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలను కూడా పరిగణించాలి.KVS అడ్మిషన్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply For KVS Admission 2024)
KVS అడ్మిషన్ 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఇక్కడ అందించాం. ఈ విధానాన్ని ఫాలో అయి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి kvsonlineadmission.kvs.gov.in వెళ్లాలి.
- స్టెప్ 2: హోంపేజీలో రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
- స్టెప్ 3: అవసరమైన ఆధారాలను ఉపయోగించి నమోదు చేసుకోండి.
- స్టెప్ 4: KVS అడ్మిషన్ దరఖాస్తును పూరించండి
- స్టెప్ 5: అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి
- స్టెప్ 6: SUBMIT బటన్‌పై క్లిక్ చేయండి
- స్టెప్ 7: భవిష్యత్ సూచన కోసం KVS అడ్మిషన్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేయండి
అయితే ఒకే విద్యార్థి కోసం ఒకే విద్యాలయానికి అనేక దరఖాస్తులు సబ్మిట్ చేయవద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. ఒకే కేంద్రీయ విద్యాలయంలో ఒకే విద్యార్థి కోసం బహుళ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేసినట్లయితే ప్రవేశ ప్రక్రియలో చివరి దరఖాస్తు మాత్రమే పరిగణించబడుతుంది. డబుల్ షిఫ్ట్ కేంద్రీయ విద్యాలయంలో కేవీఎస్ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో ప్రవేశ ప్రయోజనం కోసం ప్రతి షిఫ్ట్ ప్రత్యేక విద్యాలయంగా పరిగణించబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.