CUET 2023 పరీక్షా నగరాల జాబితా (List of CUET 2023 Exam Cities): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CUET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 12, 2023న క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసే ప్రక్రియలో అభ్యర్థులు CUET 2023 పరీక్ష నగరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అందుబాటులో ఉన్న నగరాల జాబితా నుంచి వారి ప్రాధాన్యతల ప్రకారం రెండు CUET పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు ఒక బ్రోచర్‌లో పరీక్షా కేంద్రాల జాబితాని, వాటి ప్లేస్‌లని, వాటి లోకేషన్‌లని కూడా పబ్లిష్ చేశారు. ఆ బ్రోచర్ cuet.samarth.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ఈ ఏడాది CUET 2023 పరీక్ష భారతదేశంలోని 547 నగరాల్లో, భారతదేశం వెలుపల 13 నగరాల్లో నిర్వహించడం జరుగుతుంది.
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం గురించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా తెలుసుకుంటారు. ఇది CUET 2023 హాల్ టికెట్‌ని విడుదలకు ముందు విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఏడాది CUET 2023 పరీక్ష మే 21 నుంచి 31, 2023 వరకు జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని CUET 2023 పరీక్షా నగరాల జాబితా (List of CUET 2023 Exam Cities in Andhra Pradesh)
ఈ సంవత్సరం CUET 2023 పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లోని 25 నగరాల్లో నిర్వహించబడుతుంది. ఈ దిగువున అందజేసిన టేబుల్లో సిటీ కోడ్‌లను, సంబంధిత పరీక్షా నగరాలను పరిశీలించ వచ్చు.
సీటీ కోడ్ | నగరం పేరు |
---|---|
AP01 | అమరావతి |
AP02 | అనంతపూర్ |
AP03 | భీమవరం |
AP04 | చీరాల |
AP05 | చిత్తూరు |
AP06 | ఏలూరు |
AP07 | గూడురు |
AP08 | గుంటూరు |
AP09 | కడప |
AP10 | కాకినాడ |
AP11 | కర్నూలు |
AP12 | మచిలీపట్నం |
AP13 | నంద్యాల |
AP14 | నర్సారావుపేట |
AP15 | నెల్లూరు |
AP16 | ఒంగోలు |
AP17 | ప్రొద్దుటూరు |
AP18 | రాజమండ్రి |
AP19 | శ్రీకాకుళం |
AP20 | సూరంపాలెం |
AP21 | తాడేపల్లిగూడెం |
AP22 | తిరుపతి |
AP23 | విజయవాడ |
AP24 | విశాఖపట్నం |
AP25 | విజయనగరం |
గమనిక, అభ్యర్థుల సంఖ్య 100 కంటే తక్కువ ఉంటే CUET 2023 పరీక్షా కేంద్రాన్ని రద్దు చేసే అధికారం NTAకి ఉంటుంది. అటువంటి సందర్భాలలో అభ్యర్థులకు విశ్వవిద్యాలయం సమీపంలో పరీక్షా కేంద్రం కేటాయించబడుతుంది.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.