టీఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రోజున అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు (List of Documents to Carry on TS Police Exam Day 2023): తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఏప్రిల్ 2, 2023 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహిస్తుంది. డ్రైవర్ ఆపరేటర్ పోస్టు భర్తీ కోసం TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న ఉదయం జరగనుంది. PMT/PETలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావాలి. ఈ ఎగ్జామ్ హైదరాబాద్‌లో జరగనుంది. పరీక్ష రోజున అభ్యర్థులు తమతోపాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను (List of Documents to Carry on TS Police Exam Day 2023) తీసుకెళ్లాల్సి ఉంటుంది.ఆ డాక్యుమెంట్ల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
TS కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీ ఓవర్ వ్యూ (TS Constable Mains Exam Date Overview)
టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ పరిశీలింవచ్చు.సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) |
---|---|
పోస్ట్ పేరు | తెలంగాణ కానిస్టేబుల్ |
కేటగిరి | ప్రభుత్వ ఉద్యోగం |
పరీక్ష తేదీ | ఏప్రిల్ 2, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 |
సెలక్షన్ ప్రాసెస్ | రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ |
జాబ్ లోకేషన్ | తెలంగాణ రాష్ట్రం |
అధికారిక వెబ్‌సైట్ | https://www.tslprb.in |
TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2023 కోసం పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to carry on exam day for TS Police Constable Exam 2023)
TS పోలీస్ పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాల జాబితా ఈ దిగువున ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
- అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలి.
- అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు) తీసుకురావాల్సి ఉంటుంది.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా వెంట తీసుకు వెళ్లాలి.
- అభ్యర్థులు తమ వెంట బ్లాక్ పెన్, బ్లూ పెన్ తీసుకెళ్లవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.