నీట్ హాల్ టికెట్ 2023 (NEET Admit Card 2023 Released): మే 07, 2023న జరగనున్న పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 4న తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో హాల్ టికెట్లు (NEET Admit Card 2023 Released) విడుదల చేసింది. హాల్ టికెట్లు neet.nta.nic.inలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. దానికి డైరెక్ట్ లింక్ కూడా దిగువన జోడించబడింది. మీరు మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ఉపయోగించి మీ NEET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందస్తు సిటీ స్లిప్‌లో ఇచ్చిన సమాచారంతో పాటు మీ పరీక్షా కేంద్రం వివరాలు, పరీక్ష రోజున పాటించాల్సిన సూచనలు మొదలైనవి హాల్ టికెట్‌లో ఉంటాయి.
NEET హాల్ టికెట్ 2023 లింక్ (NEET Admit Card 2023 Link)
మీరు మీ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ examservices.nic.inకి రీ డైరక్ట్ అవ్వడానికి ఈ దిగువ జోడించిన లింక్‌పై క్లిక్ చేయవచ్చు:
నీట్ హాల్ టికెట్ 2023 డైరెక్ట్ లింక్ |
---|
అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వారి ద్వారా – Click Here (యాక్టివేట్ చేయబడింది) |
అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ద్వారా - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది) |
NEET హాల్ టికెట్ 2023 సూచనలు (NEET Admit Card 2023 Instructions)
NEET 2023 హాల్ టికెట్‌కి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఈ కింద ఇవ్వబడ్డాయి:హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఎగువ ఉన్న లింక్‌పై క్లిక్ చేసి సంబంధిత ఆధారాలను, ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ NEET 2023 హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా అక్కడ అందించబడుతుంది.
ముందస్తు సిటీ స్లిప్‌లో పేర్కొన్న దాంతో పరీక్షా నగరం సరిపోలుతుందని నిర్ధారించుకోండి. ప్రశ్నపత్రం పరీక్ష తేదీ , స్లాట్, మాధ్యమాన్ని కూడా తనిఖీ చేయండి. ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే తదుపరి చర్య కోసం వెంటనే NTA హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించాలి.
మీ వ్యక్తిగత వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే NTA ప్రస్తుతం కొత్త హాల్ టికెట్‌ని కేటాయించదు. మీరు తప్పనిసరిగా అదే తప్పు హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలి. అయితే ఇది ఏజెన్సీకి నివేదించబడుతుంది. పరీక్షా కేంద్రంలో కూడా అదే విధంగా నివేదించబడుతుంది. కౌన్సెలింగ్‌కు ముందు తదుపరి సవరణలు చేయబడతాయి.
హాల్ టికెట్ తప్పనిసరిగా A4 సైజు పేపర్‌పై ప్రింట్‌లో పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి, సరిగ్గా పూరించాలి. ఈ-అడ్మిట్ కార్డులు అనుమతించబడవు.
ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని
Education News
కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.