NEET PG 2023 Likely to be Postponed
నీట్ పీజీ 2023 (NEET PG 2023):
నీట్ పీజీ 2023ను వాయిదా వేయాలని వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 15, 2023న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. NEET PG 2023ని మార్చి 5, 2023న నిర్వహించాల్సి ఉంది. దీనిని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు, దీనిని ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఆగస్టు 11 వరకు పొడిగించబడింది. కానీ ఇంటర్న్‌షిప్ పొడిగింపుతో పరీక్షా ేతేదీ, కౌన్సెలింగ్ తేదీ మధ్య గ్యాప్ పెరిగింది. ఈ మేరకు అభ్యర్థులు నీట్ పీజీ 2023 పరీక్షా తేదీని 6-8 వారాలకు వాయిదా వేయాలని అభ్యర్థించారు.
ఫిబ్రవరి 15న తెలంగాణ హైకోర్టు విచారణ సందర్భంగా జాతీయ వైద్య కమిషన్ తరపున లాయర్ నీట్ పీజీ పరీక్ష తేదీని వాయిదా వేయడానికి నిరాకరిస్తున్నట్లు స్పష్టంగా తెలిపారు. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం వీలైతే పరీక్ష తేదీని వాయిదా వేయాలని, రెండు వారాల్లోగా NEET PG 2023 ఆశావాదులకు తెలియజేయాలని NMCకి సూచించింది.
ఇది కూడా చదవండి| నీట్ పీజీ 2023 పరీక్ష వాయిదాపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?
తెలంగాణ హైకోర్టు అభ్యర్థనను ఎన్‌ఎంసీ పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులు భావిస్తున్నారు. NMC అధికారులను తెలంగాణ హెచ్‌సి అభ్యర్థించడంతో NEET PG 2023 పరీక్ష తేదీని వాయిదా వేసే అవకాశాలు పెరిగాయి. NMC, MCC పరీక్ష తేదీని వాయిదా వేస్తాయని అభ్యర్థులు అనుకుంటున్నారు. NEET PG 2023 పరీక్ష తేదీ ఏదైనా వాయిదా వేసినట్లయితే, అభ్యర్థులకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేయబడుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నీట్ పీజీ పరీక్ష అప్‌డేట్స్ కోసం nbe.edu.in చూస్తూ ఉండాలి. పరీక్ష వాయిదా ఇప్పటి నుంచి రెండు వారాల్లోగా నిర్ధారించబడుతుంది. దాని గురించి ఎటువంటి సమాచారం లేకుంటే ముందుగా షెడ్యూల్ చేసిన తేదీ ప్రకారం అభ్యర్థులు మార్చి 5, 2023న పరీక్షకు హాజరు కావడానికి ప్రిపేర్‌గా ఉండాలి. పరీక్ష తేదీ వాయిదా పడితే ఆ తేదీలను అధికారులు ముందుగానే ప్రకటించడం జరుగుతుంది.
ఇంటర్న్‌షిప్ తేదీ పొడిగింపు తర్వాత NEET PG 2023కి హాజరు కావడానికి అర్హత పొందిన అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ విండో ఫిబ్రవరి 12, 2023న క్లోజ్ అయింది. అప్లికేషన్ ఫార్మ్ సవరణ కోసం విండో ఫిబ్రవరి 17, 2023 వరకు తెరిచి ఉంది. అన్ని NEET PG 2023 రిజిస్టర్ అభ్యర్థులు పోర్టల్‌కి లాగిన్ చేసి వారి డీటెయిల్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌లో అభ్యర్థులు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా హాల్ టికెట్ జారీ చేయబడుతుంది. NEET PG 2023 కోసం హాల్ టికెట్ పరీక్ష తేదీ కంటే 7-10 రోజుల ముందు విడుదల చేయబడుతుంది.
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించినది. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.