NEET PG Postponed 2024: నీట్ పీజీ 2024 జూన్‌కి వాయిదా? లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

Andaluri Veni

Updated On: January 09, 2024 01:14 pm IST

NEET PG 2024 జూన్ వరకు వాయిదా (NEET PG Postponed 2024)  వేయబడిందా? దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఇక్కడ కనుగొనండి. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి పొందిన వివరాల ప్రకారం అప్‌డేట్స్ ఇక్కడ అందించబడ్డాయి.
NEET PG 2024 Postponed till June? Here are the latest updates (Image Credit: Pexels)NEET PG 2024 Postponed till June? Here are the latest updates (Image Credit: Pexels)

నీట్ పీజీ 2024 జూన్‌కు వాయిదా? (NEET PG Postponed 2024): రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లు ఇంకా విడుదల చేయకపోవడంతో చాలా మంది విద్యార్థులు నీట్ పీజీ 2024 వాయిదా పడిందా?  అని ఆలోచిస్తున్నారు. 2023లో పరీక్ష మార్చి 7న నిర్వహించబడింది. దానికి సంబంధించిన దరఖాస్తు ఫార్మ్ జనవరి 7, 2023న ముగిసింది.2022లో, మే 21న పరీక్ష జరగ్గా, దరఖాస్తు ఫార్మ్ జనవరి 15న ముగిసింది.  2021లోపరీక్ష సెప్టెంబర్ 11న జరిగింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ముగిసింది. అదే పద్ధతిలో NEET PG 2024 మార్చి 3న షెడ్యూల్ చేయబడినందున NEET PG 2024 కోసం దరఖాస్తు ఫార్మ్‌లు ఇప్పటికి పూర్తై ఉండాలి.  అదే పద్ధతిలో వెళ్తే NEET PG 2024 కోసం దరఖాస్తు ఫార్మ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ ఈసారి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు ఆలోచనలో పడ్డారు.నీట్ పీజీ  దరఖాస్తు ఫార్మ్ విడుదల ఎందుకు ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై విద్యార్థులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

  • డాక్టర్ మహ్పారా అనే అభ్యర్థి ట్విట్టర్‌లో ఇలా అన్నారు, ' నీట్ పీజీకి సంబంధించిన తోటి అభ్యర్థులందరికీ. గత కొన్ని రోజులుగా, వస్తున్న వివిధ వార్తలు  విషయాల కారణంగా  మేము ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. ఏది ఏమైనా మార్చి నెలలో నే నీట్ పరీక్ష ఉండే అవకాశం ఉందని అనుకుందాం. ఈ విషయంలో అనవసరంగా ఆందోళన చెంది అభ్యర్థులు మీ సమయాన్ని, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి.

  • మరో ఔత్సాహికుడు, డాక్టర్ అనురాగ్ గోయా మాట్లాడుతూ, ' మార్చిలో పరీక్ష రాయడం, సెప్టెంబర్ వరకు కౌన్సెలింగ్ కోసం వేచి ఉండటం వల్ల ప్రయోజనం లేదు. కౌన్సెలింగ్ తేదీకి దగ్గరగా నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ చేయడం విద్యార్థుల ఆసక్తి .'

ఈ గందరగోళం కారణంగా మార్చి 3, 2024న షెడ్యూల్ చేయబడిన NEET PG 2024 ఇప్పుడు జూన్ లేదా జూలై 2024లో నిర్వహించబడవచ్చని కొన్ని వర్గాలు తెలిపాయి. అధికారులు దానిని ధ్రువీకరించ లేదు. అయితే పరీక్ష ఆలస్యమైతే, అది చాలా మటుకు జరిగే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో లేదా జూలై 2024 మొదటి వారంలో నిర్వహించబడుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమవుతుంది.

NEET PG 2024 (Latest Updates Regarding the Postponement of NEET PG 2024) వాయిదాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్

నేషనల్ మెడికల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అభ్యర్థులు NEET PG 2024 వాయిదాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఇక్కడ చూడవచ్చు:

  • అప్‌డేట్ 6: సోషల్ మీడియాలో ఒక ఫేక్ నోటీసు సర్క్యులేట్ అవుతోంది. natboard.edu.inలో ప్రచురించబడని ఎటువంటి నోటీసులను అభ్యర్థులు విశ్వసించవద్దని అధికారులు సూచించారు.
  • అప్‌డేట్ 5 : NBE అధికారిక వెబ్‌సైట్ పునరుద్ధరించబడింది.
  • అప్‌డేట్ 4: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అధికారిక వెబ్‌సైట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. "ఈ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. మరింత సమాచారం కోసం మీ హోస్టింగ్ ప్రొవైడర్‌ని సంప్రదించండి." NBE అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in చూడండి. అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసినప్పుడు కింది పేజీ ప్రదర్శించబడుతుంది.
  • అప్‌డేట్ 1: COVID-19 అంతరాయం కారణంగా విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్‌ను జూన్ లేదా జూలైలో పూర్తి చేస్తారు కాబట్టి, తేదీలు సవరించబడే అవకాశం ఉంది.

  • అప్‌డేట్ 2: ఈ సంవత్సరం, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహించబడదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి మళ్లీ నెక్ట్స్ నిర్వహించే వరకు నీట్ పీజీ కొనసాగుతుంది.

  • అప్‌డేట్ 3: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉద్దేశ్యం మెడికల్ లైసెన్సింగ్, అడ్మిషన్ ప్రక్రియను సులభతరం చేయడం. అసెస్‌మెంట్ స్కిల్స్‌ను మెరుగుపరచడం కోసం FMGE NEET PGని భర్తీ చేయాలని భావించారు, కానీ ఇప్పుడు ప్రక్రియ ఆలస్యమైంది.

NEET PG 2024కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం, అభ్యర్థులు తప్పనిసరిగా natboard.edu.in ని తనిఖీ చేస్తూ ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/neet-pg-2024-is-it-postponed-till-june-latest-updates-48695/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!