NEET UG 2023 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ( NEET UG 2023) త్వరలో నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను విడుదల చేయనుంది, విద్యార్థులు ఫిబ్రవరి 2023 నుండి NEET UG కు రిజిస్టర్ చేసుకోవచ్చు. భారతదేశంలోని MBBS సీట్లను భర్తీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నీట్ పరీక్షను నిర్వహిస్తుంది. విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. NEET UG ఎంట్రన్స్ పరీక్ష మే 2023 లో జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం 13 భాషలలో నిర్వహిస్తారు, విద్యార్థులు రిజిష్టర్ చేసుకునే సమయంలో వారికి కావాల్సిన భాష ను ఎంచుకోవచ్చు. ప్రతీ సంవత్సరం 8 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష కు హాజరు అవుతున్నారు.
NEET UG 2023 రిజిష్టర్ చేసుకునే విధానం, అవసరమైన డాక్యుమెంట్లు , ముఖ్యమైన తేదీల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
NEET UG 2023 ముఖ్యమైన తేదీలు ( NEET UG 2023 Important Dates)
NEET UG 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి, ఈ తేదీలు అంచనా అని విద్యార్థులు గమనించాలి.
కార్యక్రమం | తేదీ (అంచనా) |
---|---|
జనవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
మార్చి 2023 | |
మే 2023 | |
జూన్ 2023 |
NEET UG 2023 కు ఎలా రిజిష్టర్ చేసుకోవాలి? ( How to Apply for NEET UG 2023)
విద్యార్థులు ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించి NEET UG 2023 కు రిజిష్టర్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ఓపెన్ చేయండి.
- ' Register For NEET UG 2023' అనే లింక్ మీద క్లిక్ చేయండి.
- ఓపెన్ ఆయిన దరఖాస్తు ఫారం లో మీ వివరాలు పూర్తి చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి " Submit" మీద క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారం ను, ఫీజు రిసిప్ట్ ను సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
NEET UG 2023 కు అవసరమైన డాక్యుమెంట్లు ( Documents Required to Apply NEET UG 2023)
NEET UG 2023 రిజిస్ట్రేషన్ కు క్రింద వివరించిన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- 10వ తరగతి మార్క్స్ మెమో
- విద్యార్థి సంతకం.
- పాస్పోర్ట్ సైజ్ మరియు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో లు
- ఐడీ ప్రూఫ్ ( ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఓటర్ ఐడి మొదలైనవి)
- కుల ధ్రువీకరణ పత్రం
- సిటిజెన్ షిప్ సర్టిఫికెట్
- PwD సర్టిఫికెట్
- ఎడమ చేతి బొటన వేలి ముద్ర
NEET UG 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.