నీట్ యూజీ దరఖాస్తు ఫార్మ్ 2024 (NEET UG 2024 Application): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2024-25కి సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) దరఖాస్తు ఫార్మ్‌ను (NEET UG 2024 Application) ఫిబ్రవరి 8, 2024 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. NTA తన అధికారిక పోర్టల్‌లో ఈ సంవత్సరం మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌లను ప్రకటిస్తుంది. కనీస అర్హత ప్రమాణాలను పూర్తి చేసే విద్యార్థులందరూ అనుమతించబడిన ఫార్మాట్‌ల ప్రకారం వారి స్కాన్ చేసిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
మునుపటి సంవత్సరం ట్రెండ్‌లను అనుసరించి, NTA ప్రతి సంవత్సరం మేలో NEET UG పరీక్షను నిర్వహిస్తుంది. అలాగే సీనియర్ రిపోర్టర్ తాజా నివేదికను పరిగణనలోకి తీసుకుంటే NTA ఫిబ్రవరి 8, 2024 నాటికి NEET రిజిస్ట్రేషన్ 2024ను ప్రారంభించే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫార్మ్‌లను మార్చి రెండో వారంలో సబ్మిట్ చేయవచ్చు. NEET UG 2024 పరీక్షను ఈ ఏడాది మే 5న నిర్వహించాల్సి ఉంది.
NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024 తేదీ (NEET UG Application Form 2024 Date)
NEET UG దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందించబడ్డాయి:
ఈవెంట్ | తేదీలు |
---|---|
NEET 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 8, 2024 నాటికి (తాత్కాలికంగా) |
NEET 2024 రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మార్చి 2024 రెండవ వారం (తాత్కాలికంగా) |
NEET UG 2024 పరీక్ష తేదీ | మే 5, 2024 |
NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024: సిద్ధంగా ఉంచుకోవాల్సి పత్రాలు
నీట్ యూజీకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దాని వల్ల దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తుంది. NEET పరీక్ష 2024 కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు స్కాన్ చేసిన ఫార్మాట్‌లలో ఉంచాల్సిన పత్రాల జాబితాను ఇక్కడ చెక్ చేయండి.
- పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటో
- చిరునామా రుజువు (ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/ఓటర్ ID కార్డ్)
- వయస్సు రుజువు (10వ తరగతి మార్కు షీట్)
- మార్క్ షీట్‌తో పాటు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం (వారి 12వ తరగతి పరీక్షకు హాజరయ్యే దరఖాస్తుదారులు దరఖాస్తు సమయంలో ఈ పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు)
- కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు)
- వైకల్యం సర్టిఫికెట్ (PWD అభ్యర్థులకు)
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (EWS కేటగిరీ అభ్యర్థులకు)