NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024 విడుదల తేదీ (NEET UG Application form 2024) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024 ( NEET UG Application form 2024) విడుదల తేదీని ఇంకా ప్రకటించ లేదు. అయితే మునుపటి సంవత్సరం ట్రెండ్ ఆధారంగా ఇది ఫిబ్రవరి 2024 మొదటి వారంలో నమోదు ప్రారంభించే అవకాశం ఉంది. 2023లో దరఖాస్తు ఫార్మ్ పరీక్షకు 60 రోజుల ముందు విడుదల చేయబడింది. 2022లో ఇది 102 రోజుల ముందు విడుదల చేయబడింది. 2021లో పరీక్షకు 43 రోజుల ముందు అధికారిక పోర్టల్‌లో neet.nta.nic.in అందుబాటులో ఉంచబడింది. కాబట్టి 2024లో కూడా NEET UG దరఖాస్తు ఫార్మ్ పరీక్ష రోజుకు 100 రోజుల ముందు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 5, 2024న పరీక్ష జరుగుతుంది కాబట్టి, ఫిబ్రవరి నాలుగో వారంలోగా దరఖాస్తు ఫార్మ్‌ను అందజేయవచ్చు. విడుదలైన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు ఫార్మ్‌ను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024 విడుదల తేదీ (NEET UG Application Form 2024 Release Date)
ఈ దిగువున పట్టిక ఇతర కీలకమైన వివరాలతో పాటుగా ఆశించిన NEET UG దరఖాస్తు ఫారమ్ 2024 విడుదల తేదీని ప్రదర్శిస్తుంది:
విశేషాలు | వివరాలు |
---|---|
NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024 విడుదల తేదీ | ఫిబ్రవరి 2024 మొదటి వారంలో అంచనా వేయబడింది |
NEET UG దరఖాస్తు ఫారమ్ 2024ను యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ | neet.nta.nic.in |
NEET UG దరఖాస్తు ఫార్మ్ 2024: గత సంవత్సరం ట్రెండ్
ఈ దిగువ పట్టిక NEET UG దరఖాస్తు ఫార్మ్ విడుదల తేదీ, పరీక్ష తేదీని చూపుతుంది. సులభమైన పోలిక కోసం రెండింటి మధ్య గ్యాప్ పీరియడ్‌ను చూపుతుంది:
సంవత్సరాలు | దరఖాస్తు ఫార్మ్ తేదీ | పరీక్ష తేదీ | గ్యాప్ పీరియడ్ |
---|---|---|---|
2023 | మార్చి 6, 2023 | మే 7, 2023 | 60 రోజులు |
2022 | ఏప్రిల్ 6, 2022 | జూలై 17, 2022 | 102 రోజులు |
2021 | జూలై 13, 2021 | సెప్టెంబర్ 12, 2021 | 43 రోజులు |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం
https://www.collegedekho.com/te/news/
లింక్‌పై క్లిక్ చేయండి.